Go to full page →

తండ్రియగు దేవుడు క్రీస్తు ద్వారా బయలుపర్చబడెను CChTel 194

వ్యక్తిత్వము గల దేవుడు తన కుమారునిద్వారా తనను తాను ప్రత్యక్ష పర్చుకొనెను. తండ్రి మహిమను ప్రజ్వలనము చేయుచు యేసు “ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును” కలిగి (హెబ్రీ 1:3) మానవుని వలె భువిపై నివసించెను. వ్యక్తిగత రక్షకుడై ఆయన లోకమునకు ఏగుదెంచెను. వ్యక్తిగత రక్షకుడై ఆయన ఆరోహణమాయెను. పరలోక న్యాయస్థానమందు వ్యక్తిగత రక్షకుడై ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. మన పక్షమున దైవ సింహాసనము ముందు “మనుష్య కుమారుని పోలిన యొకడు” సేవ చేయుచున్నాడు. ప్రకటన 1:13. CChTel 194.4

ప్రపంచమునకు వెలుగయిన క్రీస్తు ధగధగ మెరసెడి తన దైవత్వమును మరుగుపర్చుకొని మానవులు దహింపబడక తమ సృష్టికర్తను ఎరుగుటకుగాను వారి మధ్య జీవించుటకు భూమికి వచ్చెను. క్రీస్తు ద్వారా ఆయన ప్రత్యక్షతను తప్ప ఏ మానవుడును దేవుని చూచి ఎరుగడు. CChTel 194.5

మానవులేమి తెలిసికొనవలెనని దేవుడు కోరుచున్నాడో దానిని మానవులకు నేర్పించుటకు క్రీస్తు అవతరించెను. ఆకాశములందును, భూమియందును విశాల సముద్ర జలము లందును మనము దేవుని హస్తకృత్యమును చూచుచున్నాము. సృజింపబడిన గర్వమును ఆయన శక్తిని, జ్ఞానమును, ప్రేమను చాటుచున్నవి. దేవుని మూర్తిమంతము క్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయెను. కాని నక్షత్రములందు, సముద్రములందు, పర్వత ప్రవాహములందు దానిని కాంచలేము. CChTel 194.6

తన శీలమును వ్యక్తిత్వమును చిత్రించుటకు సృష్టి కన్న విస్పష్టమైన ప్రత్యక్షత అవసరమని దేవుడు గ్రహించెను. కంటికి కనిపించని దేవుని స్వభావమును గుణగణములను నూతన దృష్టి తాళుకొన గలిగినంతమట్టుకు ప్రత్యక్షపరచుటకు ఆయన తన కుమారుని లోకమునకు పంపెను. CChTel 195.1

పుష్పములు, వృక్షములు, గడ్డిపూచ మున్నగు సృష్టివస్తుజాలముతో దేవుడు నివశించుచున్నట్లు తన్ను తాను కనపర్చుకొనవలెనని కోరినచో క్రీస్తు ఇహలోకమందున్నపుడు దానిని తన శిష్యులకు వ్యక్తము చేసియుండడా? కాని క్రీస్తు దేవుని గూర్చి అట్లెన్నడును బోధించినవాడు కాదు. క్రీస్తును అపోస్తలులును దేవుడు స్వరూపము కలిగి నివసించువాడనిసుస్పష్టముగా బోధించిరి. CChTel 195.2

పాప మానవులు నాశనము పొందకుండ సహించగలిగినదంతయు క్రీస్తు బయలు పరచెను. ఆయన దైవోపదేశకును విశదకర్తయును క్రీస్తు ద్వారాను, తన వాక్యముద్వారాను కలిగిన ప్రత్యక్షములకన్న వేరే విధములగు ప్రత్యక్షములు మానవుని అవసరమని దేవుడు తలంచినచో దేవుడు తప్పక వానిని యిచ్చియుండును. CChTel 195.3