Go to full page →

వేదపఠనము జ్ఞానమును బలపర్చును CChTel 219

మానవులు బైబిలును చదవవలసిన రీతిగా చదివినచో వారికి బలవత్తరమైన వివేచన యుండెడిదే. దైవగ్రంథమందు చర్చింపబడిన అంశములు, దాని గంభీరమైన తేటమాటలు, మనసునకు అది అందజేయు ఉదాత్తాశయములు ఇవి మరేవిధముగా వృద్దిపొందని మానవుని మనో శక్తులను పెంపొందించును. ఊహా వృద్ధియగుటకు బైబిలులో సువిశాల స్థానము కలదు. మానవులు రచించిన కొరగాని పుస్తకములను పఠించుటకన్న బైబిలును ధ్యానించి తలంపునందును, ఉద్దేశ్యమునదును దాని మహోన్నత భావములను మనస్కరించుట విద్యార్థికి శ్రేయస్కరము. వివేకమునకు నిధియై న దైవవాక్యమును అలక్ష్యము చేయుట వలన యువజనులు అత్యున్నత మానసికాభ్యున్నతి పొందకున్నారు. మనకు ప్రతిభాసంపత్తి, అచంచలమైన విలువగల మనుష్యులు తక్కువ ఉండుటకు కారణము దైవభీతి, దైవప్రేమ లేకపోవుటయే. మత సిద్దాంతముల ప్రకారము జీవించవలసిన రీతిగా మానవులు జీవించుటలేదు. CChTel 219.2

మన మానసిక శక్తులను పెంపుచేసికొనుటకు ప్రతి తరుణమును వినియోగించుకొనవలెనని దేవుడు కోరుచున్నాడు.. . బైబిలును ఇతోధికముగా పఠించి, అందలి సత్యములను బాగుగా గ్రహించినచో మనము ఇతోధిక జ్ఞానము, ప్రతిభ కలవారమగుదుము. దైవగ్రంథపరిశోధనము వలన ఆత్మకు శక్తి చేకూరును. 13CG 507; CChTel 219.3

బైబిలు ఉపదేశము మానవుని సమస్త జీవిత ప్రగతికి అతి ప్రాముఖ్యమైనది. జాతీయాభ్యుదయమునకు తలరాయి అనదగు సూత్రమునిది బయలుపరుచుచున్నది. ఈ సూత్రములలో సమాజసుక్షేమమిమిడి యున్నది. ఈ సూత్రములు కుటుంబమునకు కాపుదలనిచ్చును. ఈ సూత్రములు లేనిదే మానవుడు జీవితమందు ప్రయోజకత్వమును, సంతోషమును జీవిత గౌరవమును, భవిష్యత్తునందు నిత్యజీవమును పొందనాశలేనివాడై యుండును. బైబిలు పఠనావశ్యకత లేకుండ మానవ జీవితాభ్యున్నతయు మానవ అనుభవప్రామాణ్యతయు కలుగదు. 14PP 599 CChTel 219.4