Go to full page →

లోకముతో వ్యాపార సంబంధములు CChTel 225

లోక వ్యవహారములను చక్కదిద్దుకొను దక్షత కొందరికి లేదు. అవసరమైన అర్హతలు వారికి లేవు. ఇది సాతాను కు వారి విషయమై అవకాశము కలిగించు చున్నది. ఇట్టి స్థితియందున్న వారు తమ కర్తవ్యమును గూర్చి అజ్ఞానము నందుండరాదు. తమ పథకములను కొనసాగించక పూర్వము వీరు తమ విశ్వాసాభిమానములను చూరగొన్న సహోదరుల సలహాలను పొందుటలో వెనుదీయరాదు. ఈ వచనము నాకు చూపబడెను. “ఒకని భారముల నొకడు భరించుడి” (గలతీ 6:2) అనేకులు ప్రజ్ఞగలవారి సహాయము పొందుట తమ మర్యాదకు భంగమని తలంచి తమ స్వకీయ యోచనల చొప్పున కార్యములను నిర్వహించి కష్టముల పాలగుదురు. అప్పుడు తమ సహోదరుల సలహా అవసరమని గుర్తించెదరు. ఆదిలోకన్న అప్పుడు ఆ కార్యమెంతభారముగా నుండును! సాధ్యమైనంత మట్టుకు సహోదరులు న్యాయస్థానమునకు పోరాదు. ఏలయనగా అట్లు చేయుటద్వారా వారిని ఉక్కిరి బిక్కిరి చేయుటకు సాతానుకు వారు అవకాశమిత్తురు. కొంత నష్టము భరించియై నను రాజీపడుట మేలు. CChTel 225.1

అవిశ్వాసులకు పూటకాపుగా తన ప్రజలుండు విషయమును గూర్చి దేవుడు నిరుత్సాహపడుట నేను చూచితిని. ఈ వచనములు నాకు చూపబడినవి. సామెతెలు 22:26. “చేతిలో చెయ్యివేయు వారితోను అప్పులకు పూటబడు వారితోను చేరకుము.” “ఎదుటి వాని కొరకు పూటబడినవవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.” సామితెలు 11:15. అపనమ్మకమైన గృహనిర్వాహకులు తమదికాని సొత్తును అనగా దేవుని సొత్తును ఇతరులకు వాగ్దానము చేయుదురు. అపవాదిచే ప్రోత్సహింస బడిన వారు ఈ సొత్తును అపనమ్మకము చూపు గృహనిర్వహకులు చేతినుండి తీసుకునెదరు. సబ్బాతీయులు అవిశ్వాసులతో విజ్జోడుగా నుండరాదు. క్రైస్తవేతరుల సలహాల కొరకు వారినాశ్రయించెదరు. ఇది వారు చేయకూడని పని అపవాది వారిని గజిబిజిచేసి దేవుని ప్రజల యొద్ద నుండి ఆయన సొత్తును తీసికొనుట ద్వార వారిని తన ప్రతినిధులుగా వాడు కొనును. 71T 200,201. CChTel 225.2