Go to full page →

బహిరంగ ప్రార్థనలు దీర్ఘముగా నుండరాదు CChTel 232

తమ అక్కరల విషయము మనవి చేయుచో క్లుప్తముగా ప్రార్థించవలెనని క్రీస్తు తన శిష్యులకు విశదము చేసెను. శారీరక, ఆధ్యాత్మిక ఆశీస్సుల కొరకు కోర్కెలను వ్యక్తము చేసి వాని నిమిత్తము తమ కృతజ్ఞతను తెలియ జేయుటకు వారు చేయు ప్రార్థనల నిడివిని, సారాంశమును గూర్చి వారికాయన ఎరుక పర్చెను. ఈ ఆదర్శ ప్రార్థన ఎంత బావయుక్తమైనది! అందరి ముఖ్యావసరమును అది వ్యక్తీకరించుచున్నది. సాధారణమైన ప్రార్థనకు ఒకటి రెండు నిమిషములు చాలును. ప్రత్యేకముగా దేవుని ఆత్మవలన ప్రార్ధన వ్రాయబడు సందర్భములు, ఆత్మద్వారా విజ్ఞాపన చేయబడు సందర్భములుండవచ్చును. ఆశక్తిగల ఆత్మ దేవుని సన్నిధిలో తన హృదయ భారమును ఉచ్ఛరించరాని మాటలతో క్రుమ్మరించును. యాకోబు వలె ఆత్మ పోరాడి దేవుని శక్తిని ప్రత్యేకముగా కనపర్చు వరకు విశ్రాంతికొనదు. ఇది దేవుని కిష్టము. CChTel 232.3

కాని యనేకులు ప్రార్థనను అవాంఛనీయముగను, ప్రసంగము వలెను చేసెదరు. ఇట్టివారు మానవునికి ప్రార్థన చేయుదురేగాని దేవునికి మాత్రము కాదు. వారు దేవునికే ప్రార్థన చేయుచు, తాము ప్రార్థించు విషయమును గ్రహించగలిగినచో తమ సాహసమును గూర్చి ఆందోళన పడెదరు. ఏలయనగా ప్రపంచమందు సంభవించుచున్న విషయములపై జగన్నిర్మాతకు ప్రత్యేక సమాచారము అవసరమైనట్లు ప్రార్థన రూపేణ వారు ప్రభువుకు ఒక ప్రసంగము చేతురు. అట్టి ప్రార్థనలన్నియు మ్రోగెడి కంచును, గణగణలాడు తాళమునై యున్నవి. అవి పరలోకమందు లెక్కకు రావు. వాని నాలకించుట తప్పనిసరియై న మానవులును, పరలోక దూతలను విసుగు చెందెదరు. CChTel 233.1

క్రీస్తు తరచుగ ప్రార్థన చేసెడి వాడు. తన మానవులను తండ్రికి ఎరుక పరచుటకు గాను ఆయన నిర్జన వనములలోనికి, సర్వత ప్రదేశములకు వెళ్లెడి వాడు. తన దినకృత్యములను నిర్వహించిన పిదప అలసిన ప్రజలు విశ్రాంతి పొందుచుండగా ఆ సమయమును క్రీస్తు ప్రార్థనలో గడుపు చుండెడిఆడు. మెళుకువగా నుండి ప్రార్థించుటయందు బహు సంకుచితముగా నున్నారు. గనుక ప్రార్థించు వారిని నేను నిరుత్సాహపరచుట లేదు. అదియును గాక ఆత్మతోను, వివేకముతో ను ప్రార్థించువారు చాల తక్కువ మంది. పట్టుదలతో కూడిన, మనఃపూర్వకమైన ప్రార్థనకు ఎప్పుడును స్థానము కలదు. అది ప్రజలకు విసుగు పుట్టించదు. దైవభక్తి పరాయణులైన వారికి అట్టి ప్రార్థన ఆశను పుట్టించి వారిని తెప్పరిల్ల చేయును. CChTel 233.2

రహస్య ప్రార్థన అలక్ష్యము చేయబడుచున్నది. ఈ హేతువు చేతనే దేవుని నారాధించుటకు కూడినపుడు అనేకులు దీర్ఘమైన, ఆయాసకరమైన, అవాంఛనీయమైన ప్రార్థనలు చేసెదరు. తమ ప్రార్థనలలో ముందటి వారము తాము నిర్లక్ష్యము చేసిన విధులను గూర్చి పదేపదే ప్రార్ధించి తమ్మును బాధించుచున్న మనస్సాక్షిని శాంతి పరచి తమ అలక్ష్యమునకు క్షమాపణ పొంద నిరీక్షింతురు. కాని ఆధ్యాత్మికాంధకారముతో నిండిన ఈ ప్రార్థ నలు తామున్న తక్కువ స్థాయికి ఇతరుల మనస్సులను తెచ్చును. మెళుకువగా నుండి ప్రార్థించుటనుగూర్చి క్రీస్తు చేసిన బోధలను క్రైస్తవులు గ్రహించినచో దేవుని నారాధించుటలో వారు ఇతోధిక జ్ఞానము సంపాదించెదరు. 22T 581,582; CChTel 233.3