Go to full page →

సిద్ధబాటు సంస్కారము CChTel 247

ఈ వినయాచారమును ప్రభురాత్రి భోజనమునకు సిద్ధబాటుగా క్రీస్తు నియమించెను. గర్వము, విభేదము, అధికారము కొరకు పోరాటము, ఇత్యాదులను మనస్కరించుచో హృదయము క్రీస్తుతో సహవాసము చేయలేదు. ఆన శరీరమందును రక్తమందును పాలు పుచ్చుకొనుటకు మనము సిద్ధముగా లేము. ఆ కారణముగా తాను భరించనైయున్న అవమానమునకు స్మారక చిహ్నముగా ఈ వినయాచారము మొదట అనుష్ఠించబడవలెని యేసు ప్రభువు నియమించెను. CChTel 247.2

దేవుని పిల్లలు ఈ యాచారమందు పాల్గొనుటకు సమావేశమగునపుడు మహిమ, జీవములకు కర్తయగు ప్రభువు ఉపదేశించిన యీ మాటలను స్మరించవలెను. “వారి పాదములు కడిగి తనపై వస్త్రమును వేసికొన్న తరువాత ఆయన మరల కూర్చుండి`నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు, ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను మీకు బోధకుడను, ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదుమలు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడుÑ అపొస్తలుడు తన్నుపంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.” (యోహాను 13:12`17) CChTel 248.1

తన సహోదరునికన్న తానధికుడనని తలంచు స్వభావము, స్వార్థము కొరకు పాటుపడి ఉన్నతస్థానము నపేక్షించు స్వభావము, మానవుని యందు గలదు. తరుచు దీని ఫలితముగా అపోహలు మనస్పర్ధలు కలుగును. ప్రభురాత్రి భోజనమునకు ముందు జరుపబడు ఈ యాచారము ఈ యభిప్రాయ భేదములను తొలగించుటకు ఏర్పాటు చేయబడెను. మానవుడు స్వార్థప్రీతిని స్వాభిమానమును, విడిచి తన సహోదరునికి సేవచేయుటకు నడిపించు వినయ హృదయమును పొందుటకిది నియమించబడినది. CChTel 248.2

పరలోక మందలి దేవుడు ఇట్టి సమయమందు హాజరగును. ఆత్మపరిశోధన, పాపచింత, పాపక్షమాపణ నిశ్చయతను కలుగజేయు కూటముగా దానిని ఆయన మార్చును. స్వార్థ ప్రవాహములో కొట్టుకొని పోవుచున్న యోచనా ధోరణిని మార్చుటకు సంపూర్ణ కృపతో అక్కడ క్రీస్తుండును. తమ ప్రభుని మాదిరి అవలంబించు వారి బుద్ధికి పరిశుద్ధాత్మ చురుకుదనము కలిగించును. మన నిమిత్తము రక్షకుడు భరించిన అవమానమును గూర్చి స్మరణచేయునపుడు తలంపుతో తలంపు జతపడునుÑ భూలోక మిత్రులపట్ల దేవుడు చూపిన దయాదరములు, సౌజన్యములను గూర్చిన స్మృతులు పరంపరగా వచ్చును. CChTel 248.3

ఈ సంస్కారము సక్రమముగా ఆచరించబడునుపుడు దేవుని పిల్లలు ఒకరికొకరు సహాయము చేసికొని ఆశీర్వాదకరముగ నుండుటలో పవిత్ర సంబంధమునకు నడిపించబడెదరు. నిస్వార్థసేవ చేయుటకు జీవితము నంకితము చేసెదమని వారు ఖరారు పడెదరు. ఇది ఒకరికొకరు చేయుట మాత్రమే కాదు. వారి కార్యరంగము తమ ప్రభుని కార్యరంగమంత విస్తృతమైనది. మన పరిచర్య అవసరమైన వారితో ప్రపంచము నిండియున్నది. బీదలు, అనాథులు, అమాయకులు ఏమూల చూచినను కలరు. క్రీస్తుతో మేడపై గది యందు ప్రభురాత్రి భోజనమందు పాలుపుచ్చుకొన్నవారు ఆయన వలెనే సేవ చేయుటకు పురోగమించిరి. CChTel 248.4

అందరి సేవలను అందుకొన్న యేసు అందరికి సేవచేయుటకు వచ్చెను. అందరికి సేవచేసెను గనుక అందరు ఆయనను గౌరవించి సేవించనై యున్నారు. ఆన దైవ గుణగణములు కలిగి ఆయనతో కలిసి ఆత్మల రక్షించు విషయమందు ఆనందించగోరువారు ఆయన చేసిన నిస్స్వార్ద సేవను అనుకరించవలెను. CChTel 249.1