Go to full page →

అధ్యాయము 29 - వివాహము CChTel 270

దేవుడు నరుని నుండి నారిని నిర్మించెను. ఆమె అతనికి చెలికత్తెగాను సాటిjైున సహాయముగాను ఉండి అతనితో జీవించి అతనికి ఆనందమును, ధైర్యమును కూర్చి యాతని కాశీర్వాదకరముగ నుండుటకును అతడామెకు గొప్ప సహాయకుడుగా నుండుటకును దేవుడు వారిని సృజించెను. భర్త స్త్రీ యొక్క పవిత్ర ప్రేమను చూరగొనుట, భార్య భర్త యొక్క శీలమును మెరుగుపరిచి నిర్థుష్టమొనర్చుట ` అను నీ విశుద్ధ లక్ష్యముతో వివాహమాడు వారు తమ యెడల దేవునికి గల సంకల్పమును నెరవేర్చు వారగుదురు. CChTel 270.1

క్రీస్తు ఈ సంస్థాపనను రద్దు చేయుటకు రాలేదు. కాని, దాని యధాపూర్వ పవిత్ర ఉన్నత స్థితికి తెచ్చుటకాయన వచెచను. మానవుని యందు దేవుని యొక్క నీతి స్వరూపమును తిరిగి స్థాపించుట కాయన వచ్చెను. వివాహసంబంధమును అనుమతించుటతో ఆ పని నాయన ప్రారంభించెను. CChTel 270.2

ఆదాముకు హవ్వను సాటిjైున సహాయముగా అనుగ్రహించిన ఆ ప్రభువే వివాహ విందులో తన ప్రధమ సూచక క్రియను చేసెను. స్నేహితులు బంధువులు కలిసి ఆనందించిన ఉత్సవమందిరములో క్రీస్తు తన బహిరంగ సేవను ప్రారంభించెను. ఇట్లు వివాహ సంస్థాపనను తానే స్థాపించితినని గుర్తించుచు ఆయన వివాహమును పవిత్రపరచెను. స్త్రీ పురుషులు పవిత్ర వివాహము ద్వారా జతపర్చబడి పరలోక కుటుంబ సభికులుగా పరిగణించబడగల పేరు ప్రతిష్టలు గల కుటుంబములను ఉత్పత్తి చేయవలెనని ఆయన సంకల్పించెను. CChTel 270.3