Go to full page →

పాలిచ్చు తల్లియొక్క మనస్తత్వము CChTel 291

ప్రకృతి సరఫరా చేయు ఆహారమే బిడ్డకు ఉత్తమాహారము. ఏది కొరవడనీయరాదు. సాంఘిక వినోదములకు పోవలసినందున ,తల్లి బిడ్డకు పాలిచ్చుట యను మహత్తర కార్యమును తప్పించుకోన జూచుట నిర్దయాత్మకము. CChTel 291.4

బిడ్డ తల్లియొద్దనుండి పోషణ పొందు కాలము ప్రాముఖ్యమైనది. బిడ్డలకు పాలిచ్చు సమయమందు చాలామంది తల్లుల ఎక్కువ వంట పనిని చేయుటద్వారా తమ రక్తమును వేడిచేసి కొనెదరు. దీనివాళ్ళ శిశువుకు చాల హాని కలుగును. శిశువు జ్వరపు పాలను త్రాగుటయే గాక తల్లి తిను మలినాహారము వలన శిశువు రక్తము విషకలుషితమైన జ్వరము కలిగిన తద్వారా శిశువు యొక్క ఆహారము హానికరమగునట్లు చేయును. తల్లి మనస్తత్వమునకునుగుణముగా శిశువుయొక్క ఆరోగ్యముండును. తల్లి విచారము, కలవరము, ఉద్రిక్తత, కోపములకు లోనైనచో ఆమె కడనుండి శిశువు పొందు ఆహారము మంట పుట్టించునదై తరచు కడుపునొప్పి, కొన్ని సందర్భములలో మూర్చకలుగజేయును. CChTel 291.5

తల్లియొద్ద నుండి పొందిన ఆహారమును బట్టి బిడ్డ యొక్క శీలము కొంతవరకు ఏర్పడును. కనుక తల్లి శిశువుకు పాలిచ్చునపుడు తన స్వభావమును పూర్తిగ ఆధీనమందుంచుకొని ఉత్సాహపూరితమైన మనస్తత్వమును కలిగియుండుట చాలా ప్రాముఖ్యము. ఇట్లు చేసినచో బిడ్డయొక్క ఆహారము హానికరము కాకుండును. తల్లి తన బిడ్డ పట్ల గైకొను శాంతమైన, స్థిరబుద్ధి గల విధానము బిడ్డయొక్క స్వభావమును తీర్చిదిద్దుటలో చాలా సహాయము చేయును. బిడ్డ చికాకుగను ముక్కోపిగను ఉన్నచో తల్లియొక్క జాగృతిగల, శాంతమైన విధానము బిడ్డను శాంతిపరిచి సరిదిద్దును. శిశువుయొక్క ఆరోగ్యము కూడా వృద్ధి చెందును. 2AH 255-267; CChTel 292.1