Go to full page →

బిడ్డ క్రమశిక్షణ యందు ఆత్మ నిగ్రహవశ్యకత CChTel 293

బిడ్డను తర్ఫీదు చేయుటలో బలమైన, పరిపక్వమైన మాతృచిత్తము, ఆలోచన, క్రమశిక్షణ లేని బిడ్డ యొక్క చిత్తమును ఎదుర్కొనవలసిన సమయము వచ్చును. ఇట్టి సమయమందు తల్లికి ఎక్కువ వివేకము అవసరము. అవివేకముగా వ్యవహరించుట వలన కాఠిన్యము కలిగి నిర్భందించు వలన బిడ్డకు ఎక్కువ హానికలుగును. CChTel 293.2

సాధ్యమైనప్పుడెల్ల ఈ దుస్థితిని తొలగించవలెను. ఏలయనగా దాని వలన తల్లికిని బిడ్డకును కష్టములు కలుగును. కాని అట్టి పరిస్థితి వచ్చినపుడు తన తల్లియొక్క జ్థానయుతమైన చిత్తమును బిడ్డ చిత్తము లొంగవలెను. CChTel 293.3

తన బిడ్డలయందు ధిక్కార స్వభావమును కలిగించునదేదియు చేయకుండ తల్లి తన్నుతాను సంపుర్గముగా అదుపు చేసికోనవలెను. గంభీర స్వరము పెట్టి ఆమె శాసించుట కూడదు. స్వరమును తక్కు స్థాయిలో నుంచుటద్వారా ఆమెకు ఎక్కువ లాభము కలుగును. బిడ్డడు క్రీస్తు చెంతకు ఆకర్షించబడు విధముగా ఆతని పట్ల ఆమె వ్యవహరించవలెను. దేవుడే తన సహాయకుడనియు ప్రేమయే తన శక్తీ యనియు ఆమె గ్రహించవలెను. CChTel 293.4

ఆమె వివేకముగల క్రైస్తవ గృహిణియైనచొ తన బిడ్డను బలాత్కారముగా లొంగదీయుటకు ప్రయత్నించదు. అపవాది జయము నొందకుండునట్లు ఆమె పట్టుదలతో ప్రార్ధించును. ప్రార్ధించునపుడు తన ఆధ్యాత్మిక జీవితమూ పోడిగించబడును నమ్మును. తన యందు పని చేయుచున్న శక్తీ యేతన బిడ్డ యందు కుడా పనిచేయుచున్నదని ఆమె గుర్తించును. అప్పుడతడు స్వతికము కలిగి లొంగుబాటుకు. వచ్చును యుద్ధ మందు జయము. కలుగును ఆమె ఓర్పు ,దయ , జ్ఞానయుతమైన ఆమె హెచ్చరికలు వాని వాని పనిని నిర్వహించినవి. వర్షము తరువాత సూర్యుడు ప్రకాశించినట్లు గాలివాన అనంతరము శాంతి కలుగును. ఈ దృశ్యమును చూచుచున్న దేవదూతలు ఆనంద గీతములు పాడెదరు. CChTel 294.1

ఇట్టి క్లిష్టపరిస్థితులు భార్య భర్త ల జీవితమందు కూడ ఏర్పడును. దైవాత్మ ఆధీనమందుండిననే కాని వారట్టి సమయములలో తరుచు పిల్లలు ప్రదర్శించు మంకుతనమును,అనాలోచిత విధానమును ప్రదర్శించెదరు. చెకుముకిరాళ్ళు ఒకదానితో నొకటి రాచుకున్నట్లు చిత్తమునకు చిత్తమునకు సంఘర్షణ వచ్చును. 37T 47,48. CChTel 294.2