Go to full page →

కోపముతో నున్నప్పుడు బిడ్డను దిద్దరాదు CChTel 374

పిల్లలు అవిధేయులైనచో వారిని దిద్దుట అవసరము. వారిని దిద్దుటకు ముందు ఒంటరిగా వెళ్లి మీ పిల్లల హృదయములను మెత్తపరచి సమాధానమందు క్రీస్తుని సంధించుటకు సిద్దపడువారందరు పవిత్రమైన, పరిశుద్దమైన, ప్రవర్తన కలిగి యుండవలెనని ఆయనకు అవగతమే. మీ హృదయము కోపముతో కుతకుత ఉడుకుచున్నప్పుడు పిల్లవాడు ఆధ్యాత్మిక విషయములను గ్రహించునట్లు మీరు చేయజాలరు. CChTel 374.3

మీరు మీ బిడ్డలను ప్రేమతో క్రమపర్చవలెను. మీకు కోపము రేగి ఆ కోపముతో వారి తరుణము వచ్చువరకు వారిని తమ యిష్టప్రకారము చేయనీయకుడి. అట్టి శిక్ష చెడుగును తోలిగించుటకు బదులు బలపర్చును. CChTel 374.4

తప్పుచేయు పిల్లవాని యెడల కోపము ప్రదర్శించుట ఆ కీడును అధికము చేయుట మాత్రమే యగును. అది పిల్లవానికి మరింత కోపము పుట్టించి మీరాతననిని ప్రేమించుట లేదని అతడు తలంచుటకు దారితీయును. మీరు అతని ప్రేమించినచో ఆ విధముగా అతని శిక్షించరని యతడు తనలో తాననుకొనును. CChTel 375.1

ఈ పిల్లలు క్రమపర్చబడు విధానమును దేవుడు గమనించడని మీరు తలంచుచున్నారు? ఆయన ఎరుగును. సంస్కరించుపని పిల్లలను చెదరగొట్టుటకు బదులు వారిని చేరదీయులాగున నిర్వహించబడినచో దాని వలన కలుగు సత్పలితములను గూర్చి కూడ ఆయన యెరుగును. 24CG 244, 245; CChTel 375.2