Go to full page →

సంశయవాదుల గ్రంథములను దేవుడు నిషేధించుచున్నాడు CChTel 394

మన యువజనులముందు, పిల్లముందు సాతానుని తప్పుడు సిద్ధాంతములు, తప్పుడు ఊహలు, తప్పుడు బోధలు ఉంచవలెనని దేవుని సంకల్పమా?తమ జ్ఞానాభివృద్దికై అన్యమతపు దుర్భోధలను మన విద్యార్థులు వినవలెనా? మిక్కిలి తెలివితేటలుగల సంశయవాదుల గ్రంథములు అపవాది సేవకై ప్రతిష్ఠితములైనవి. సంస్కర్తలమని చెప్పుకొనుచున్నవారు మంచి మార్గమందు అనగా దేవుని వలన విమోచింపబడినవారికి ఏర్పరచబడిన మార్గమందు యువజనులను పిల్లలను నడిపించవలెనని కోరువారు, యువజనులు పఠించుటకుగాను దేవుని ప్రవర్తనకు అపార్థమాపాదించి ఆయనను అబద్ధికుని చేయు గ్రంథములను ఇచ్చుట దేవుని సంకల్పమా? అట్లనరాదు. 40CT 25, 26; CChTel 394.3