Go to full page →

మానవుని ఆహారము విషయము దేవుని మొదటి ఏర్పాటు CChTel 410

ఉత్తటమాహరమేదో తెలిసి కొనుటకు ,మానవుని ఆహారము విషయము దేవుని ఆదిమసంకల్పమేమో పరిశీలించవలెను. మానవుని సృజించి అతని యవసరములను గ్రహించగల ఆ ప్రభువు ఆదాముకు తన ఆహారమును నియమించెను. “ఇదిగో భూమిమీదనున్న విత్తనము లిచ్చు మొక్కను ,విత్తనములిచ్చు వృక్షమును ఇచ్చియున్నను అవి మీకాహరమగును. ”(అది 1:29) పాపశాపము వలను భూమి దున్ని జీవనోపాధి సంపాదించుకొనుటకు ఏదేను విడచిన పిదప మానవునికి “పోలములోని పంట తినుటకు “అనుమతి ఇయ్యబడెను. (అది 3:18) CChTel 410.1

పప్పుదినుసులు ,ఫలములు ,గింజలు ,కూరగాయలు ఏవి సృష్టి కర్త మనకిచ్చిన ఆహారము. ఈ యాహారపదార్ధములు సామాన్యముగాను స్వభావికముగాను తయారు చేయబడినచో నవి ఆరోగ్యమును బలమును ఇచ్చు ఆహారమగును. అదిబలమును ,సహశక్తిని మానసిక బలమును ఇచ్చును. ఇంతకన్న వేరైనా రుచికరమైన ఆహారము వీనిని ఎయ్యజాలదు. 2MH 295, 290; CChTel 410.2

ఆరోగ్యమును కాపాడు కొనుటకు మంచి బలవర్ధకాహారము అవసరము. CChTel 410.3

మనము వివేకముగా ఏర్పాటు చేసినచో ఆరోగ్యమును తోడ్పడు ఆహార పదార్దములు దాదాపు అన్ని దేశములలోని లభించు. బియ్యము ,గొదుములు ,జొన్న ,యవలతో తయారు చేయబడిన ఆహార పదార్దములు ప్రపంచముయొక్క ఆయా భాగములకు ఎగుమతి చేయబడుచున్నవి. ఇవి ,స్వదేసమందున్నట్టియు ,దిగుమతియైనట్టియు దినుసులు ఆయా కూరగాయలు మాంసము లేకుండగనే బాలవర్ధకమయిన ఆహారమును ఎన్నుకొనుటకు అవకాశము నిచ్చును. CChTel 410.4

కిసిమిసి పండ్లు ,ప్రూనుపండ్లు ,ఏపిల్ పండ్లు ,పియారు పండ్లు ,సిచ్ పండ్లు ,ఏప్రికాటు పండ్లు సరసమైన ధరలకు దొరుకుచోట్ల అవి అనుదినాహార పదార్ధములుగా ఉపయోగించబడుట మంచిది. దీని ఫలితముగా అన్ని వర్గాములవారికి మంచి ఆరోగ్యము ,బలము చెకూరును. 3MH 299; CChTel 410.5