Go to full page →

విస్తారమైన రోగములకు జబ్బులకు కారణము CChTel 419

మాంసము ఎన్నడూ ఉత్తమాహారము కానేరదు. మాంసాహరమిప్పుడు మరింత ఆవాంఛనీయము. ఏలయనగా నేడు జంతువులలో రోగములు త్వరితముగా వృద్ది చెందుచున్నవి. జంతువులు జీవించియున్నప్పుడు వానిని చూచినచో వారు ఎట్టి మాంసమును తినుచున్నరో గ్రహించి ప్రజలు మాంసాహారమున సహ్యించుకొని విసర్జించెదరు. క్షయ, పుట్టకురుపు క్రిములతో నిండిన మాంసమును ప్రజలు నిత్యము తినుచున్నారు. ఇట్లు క్షయ, క్యాన్సరు, తదితర ప్రాణాంతక రోగములు సంమ్రించుచున్నవి. 3MH 313; CChTel 419.4

మాంసాహారముద్వారా రోగమునకు గురియగు అవకాశము పదిరెట్లు పెరుగుచున్నది. 42T 64; CChTel 420.1

జంతువులు రోగముతో నిండియున్నవి. వాని మాంసమును భుజించుటద్వారా మనము రక్తము నందును కండరములందును వ్యాది భీజములను వాటుకొను చున్నాము. మలేరియా వాతావరణము మార్పులకు లోనగునపుడు ఇవి బయట పడును. అంతేకాక అంటు వ్యాదులు ప్రబలినపుడు రోగమును ప్రతిఘటించు శక్తి మనకుండదు. CChTel 420.2

దేవుడు నా కనుగ్రహించిన వెలుగు ప్రకారము కేన్సరు, కంతులు ప్రబలుటకు చచ్చిన జంతువుల మాంసభక్షణయే కారణము. 5CD 386-388; CChTel 420.3

అనేక స్థలములలో చేపలు ఎక్కువ మలిన పదార్థము తిని రోగ వ్యాప్తికి కారణమగు చున్నవి. పెద్ద నగరములు మురికి కాలువలు కలియు జలములలోని చేపలు ముఖ్యముగా నిట్టివే. మురికి నీటి కాలువలలోని మాలిన్యమును తిను చేపలు ప్రవాహముతో దూరముగా కొట్టుకొని పొయి స్వచ్ఛమైన నీరున్నచోట పట్టుకొనవచ్చును. ఇట్లు వానిని దినుటద్వారా అంతపాయమున్నదని కూడ తలంచని వారికి వ్యాది మరణములు ప్రాప్తించుచున్నవి. CChTel 420.4

మాంసాహారపు ఫలాతములు వెంటనే కాన్పించక పోవచ్చును కాని యిది హానికరము కాదనుటకిది యొక నిదర్శనముకాదు. తాము భుజించు మాంసము తమ రక్తమును విషకలితముచేసి బాధకలిగించినదని చెప్పిన నమ్మువారు చాల తక్కువ మంది. కొందరు కేవలము మాంసాహరము వలన మరణించెదరు. కాని యా మరణమునకు అసలు కారణములను వారు గాని తదితరులు గాని గుర్తింపరు. 6MH 314, 315; CChTel 420.5