Go to full page →

దృఢసంకల్పము కొరకు విజ్ఞప్తి CChTel 427

సెవెంతుడే ఎడ్వెంటిస్టులు గంభీరసత్యములను ప్రకటించుచున్నారు. నలుబది సంప త్సరముల క్రిందట (1863లో) ప్రభువు మనకు ఆరోగ్య సంస్కరణ విషయము వెలుగు నిచ్చెను. అయితే మన మా వెలుగులో నెట్లు నడుచుచున్నాము. దేవుని ఉపదేశముల ప్రకారము జీవించుటకు ఎంతమంది నిరాకరించింది! మనము పోందిన వెలుగు నమస్కరించి పురోగమించవలసి యున్నాము. ఆరోగ్య సంస్కరణ సూత్రములను గ్రహించి, వానిని అనుసరించుట మన విధి. ఆశానిగ్రహ విషయమందు ఇతర ప్రజలకన్నా మనము ఎక్కువ వృద్ది గాంవలెను. ఈ యంశము పై దేవుడిచ్చిన వెలుగును ఆలక్ష్యము చేయుచున్న పచ్చినట్లు తిని తమ యిష్టము వచ్చిన పని చేయుచున్నారు. వారు తమ యిష్టము వచ్చినట్టు తిని తమ యిష్టము వచ్చిన పని చేయుచున్నారు. CChTel 427.4

మన పనియందలి నాయకులు ఉపాధ్యాయులు ఆరోగ్య సంస్కరణ విషయము బైబిలు నియమమును బలవత్తరముగా పాటించి లో క చరిత్రయందు కడవరి దినములలో మనము నివసించుచున్నామని విశ్వసించు వారికి సూటియై న సాక్ష్యమీయవలెను. దేవుని సేవించు వారికి తమకే తాము సేవ జేసికొనువారికిని మధ్య వ్యత్యాసము కనపర్చబడవలెను. CChTel 428.1

ఈ వర్తమానారంభదశలో మనకీయబడిన నియమములు అప్పుడెంత ప్రాముఖ్యమై యుండెనో యిప్పుడు కూడ నంత ప్రాముఖ్యములని గ్రహించవలెను. అవి అప్పుడెంత నమ్మకముగా ఆచరించబడెనో యిప్పుడు కూడ నంత నమ్మకముగా ఆచరించబడవలెను. ఆహారము విషయము ఇయ్యబడిన వెలుగును ఎన్నడును అవలంబించని వారు కొందరున్నారు. కుంచము క్రింత నున్న వెలుగును తీసి దాని ప్రకాశకిరణములను ప్రజ్వలింపజేయుటను సమయమితే. CChTel 428.2

ఆరోగ్య జీవన సూత్రములు వ్యక్తిగతముగా నునకు చాల లాభకరములు. ఆదిలో ఆరోగ్య సంస్కరణ సందేశము వచ్చినపుడు నేను చాల బలహీనముగా నుంటిని. తరుచు కండ్లు తిరిగి నేలబడెడిదానను. సహాయము కొరకు నేను దేవునితో విజ్ఞాపన చేయగా ఆరోగ్య సంస్కరణను మహత్తరింశమును ఆయన నాకు తేటపరచెను. తన ఆజ్ఞలను కాపాడుచున్న వారు తనతో పరిశుద్ద బాంధవ్యము నిలుపుకొనవలెననియు ఆహారపానములలో మితము తలిగి యుండుటద్వారా సేవ చేయుటకు అర్హమగు రీతిగా శరీర మానసములను ఉంచుకొనవలెననియు ఆయన నాకుపదేశించెను. ఈ వెలుగు నాకు గొప్ప ఆశీర్వదకలమైనది. దేవుడు నాకు బలము నొసగునని యెరిగి ఆరోగ్య సంస్కర్తగా నేను నిర్ధారణ చేసికొంటిని. వయస్సు మీరినను నాబాల్య దినములలో కన్న ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యమున్నది. CChTel 428.3

కలముతో ప్రచారము చేసినంతగా నేను ఆరోగ్య సంస్కరణ సూత్రములను పాటించక లేదని కొందరు నాపై అభాండములు వేసిరి. నేను నమ్మకమయిన ఆరోగ్య సంస్కర్తగా జీవించితినని చెప్పగలను. ఇది వాస్తవమని నా కుటుంబ సభ్యులను ఆకళింపే. CChTel 429.1