Go to full page →

వైద్య సేవ సత్యమునకు ద్వారము తెరచును CChTel 462

మిషనెరీ నర్సు అభివృద్ధి పరచవలసిన శాఖలు చాల కలవు. కుటుంబములదు ప్రవేశించి సత్యమునందు ఆసక్తిని పుట్టించుటకు సుశిక్షితురాలైన నర్సుకు బహుళావకాశములు కలవు. దాదాపు ప్రతి సమాజమందును, బహుళ సంఖ్యాకులు ఏ మత సంబంధమైన ఆరాధనకును హజరుకారు. వారిని సువార్తద్వారా చేరదలచినచో వారి గృహములకు సువార్తను కొనిపోవలెను. తరచుగా భౌతికావశ్యకతలను తీర్చుటయే వారిని సంధించుటకు మార్గము కావచ్చును. సువార్తిక నర్సులు రోగులకుపచరించి బీదల విచారములను తొలగించునపుడు వారితో కలిసి ప్రార్ధించుటకు, దైవవాక్యమును చదివి వారికి వినిపించుటకు, రక్షకునిగూర్చి చెప్పుటకు వారికనేక అవకాశములు దొరకును. శరీరాశలు కలుగజేసిన ఆహార్ఛేను స్ధాఈన పరచుకొనుటకు బలమలేని అభాగ్యులతోడను వారికొరకును వారు ప్రార్ధించవచ్చను. పరాజయమొంది నిస్పృహ చెందిన వారికి వారు నిరీక్షణ కిరణము నీయవచ్చును. నిష్కారణమైన దయాకార్యములద కనపర్చబడిన నిస్వార్థ ప్రేమ ఈ వ్యాధి బాధితలు క్రీస్తు ప్రేమయంద నమ్మికయుచునట్లు చేయును. CChTel 462.2

ఒకానొకప్పుడు మంచి మనస్సులు, గొప్ప అర్హతలు కలిగి ప్రస్తుతము హీనస్థితి యందున్నను సరియై న కృషివలన తమ పతిత స్ధితి నుడి రక్షించబడ వీలున్న మనుష్యులన వైద్య సేవ కనుగొనగలదని నాకు చూపబడెను. మానవులకు సానుభూతితో సేవ చేసి వారి భౌతికావసరములను తీర్చిన పిదప వారి మనస్సులకు క్రీస్తుతో నున్నరీతిగా సత్యమును అందించవలెను. అట్టి ఆత్మల కొరకు కృషి చేయుచున్న మానవ మధ్యవర్తులతో పరిశుద్ధాత్ముడు సహకరించి పని చేయుచున్నాడు. తమతమ విశ్వాసము బండపై కట్టబడుటను కొందరు అభినందించెదరు. CChTel 462.3

ద్వారము తెరుచుటకు కుడిచెయ్యి యుపయోగించబడగా లోనికి ప్రవేశించును. వైద్యసేవ నిర్వహించవలసిని పాత్రయిదే. ప్రస్తుతకాల సత్యమంగీకరించబడుటకిది మార్గమును సిద్ధము చేయువలెను. హస్తములు లేని శరీరము నిష్ప్రయోజన. శరీరము నభినందించునపుడు సహాయము చేయు హస్తములను కుడా అభినందించవలెను. ఇవి లేనిదే శరీరమేమియు చేయజాలదు. దక్షిణ హస్త సాహయ్యము నంగీకరించకుండ దానిని అలక్ష్యము చేయు శరీరము ఏపనియు చేయజాలదు. దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును. CChTel 463.1

సువార్త ననుసరించి జీవించుట ,దాని సూత్రములని ఘనపరుచుట ఇదియే జీవార్ధమయిన జీవపు వాసన. కేవలము సువర్తనే ప్రకటించు వ్యక్తికీ మూయబడిన ద్వారములు వివేకియగు వైద్య సువార్తికునికి తీయబడును. బౌతిక బాధలను తొలిగించుటద్వారా దేవుడు హృదయములను ఆకర్శించగలడు. సత్యబీజమొకటి మనస్సున విత్తబడగా దేవుడు దానికి నీరు పోయును. ఈ బీజము మొలకలెత్తు వరకు ఓపిక యుండవలెను. తుదకది పెరిగి నిత్యజీవ ఫలములను ఫలించును. 9MM 238-247. CChTel 463.2