Go to full page →

అధ్యాయము 58 - సాతాను మోసపుచ్చు పని CChTel 475

దుష్టదూతలు ఆత్మలకొరకు పోరాడుట, దేవదూతలు వారిని ప్రతిఘటించుట నేను చూచితిని. పోరాటము బలముగా సాగుచున్నది. వాతావరణమును తమ చెడ్డ పలుకుబడితో పాడుచేయుచు తమ బుద్ది బలములను మందములొనర్చుటకు ఈ ఆత్మల చుట్టు దుష్టదూతలు మూగియుండిరి. సాతాను పటాలమును వెనుకకు తరిమి వేయుటకు దూతలు అప్రమత్తులై వేచియుండిరి. కాని మానవుల యిష్టమునకు విరుద్ధముగా తమ మనస్సులను శత్రువులకప్పగించి యాతనిని ప్రతిఘటించుటకు యత్నించకున్నచో తమ్మును మేల్కొలిపి సహాయము కొరకు ఆకాసమువంకకు చూచు నిమిత్తము అపాయమందున్న వారికి ఇంకను వెలుగీయబడువరకు వారిని నాశనము చేయకుండా సాతాను పరివారమును వారించుట తప్ప శిష్టదూతలు మరేమియు చేయజాలరు. ఆత్మ రక్షణకు కృషి చేయని వారిని కాపాడుటకు దేవుడు పరిశుద్ద దూతలను పంపడు. CChTel 475.1

తామొక ఆత్మను పోగొట్టుకొను అపాయమందున్నామని సాతాను గుర్తించినపుడు ఆయాత్మను తన ప్రక్కనుంచుకొనుటకు తన శక్తికొలది కృషి చేయును ఆ వ్యక్తితన అపాయమును గుర్తించి దుఃఖముతోను పట్టుదలతోను బలము కొరకు యేసునాశ్రయించినచో, తానొక బందీని పొగొట్టుకొనుచున్నానని సాతానుడు భీతిల్లి తన దూతగణములను పిలిచి దేవుని వెలుగు చేరకుండ ఆ వ్యక్తి చుట్టు చీకటి గోడన నిర్మించుడని చెప్పును. కాని అపాయమందున్న వ్యక్తి పట్టుదల కలిగి నిలిచి క్రీస్తు రక్త ప్రభావమును ఆశ్రయించినచో, విశ్వాసముతో ప్రార్థించినచో మన రక్షకుడా ప్రార్థన నాలించి యాతనిని విడిపించుకు బలము నందదికులకు దూత సందోహమును పంపును. CChTel 475.2

శక్తిగల ప్రతిపక్షనాయకుని ముందు సాతానుడు నిలువజాలడు. ఏలమనగా ఆయన బలమును ఠీవిని చూచి అతడు కంపితాత్ముడగును. పట్టుదలతో కూడిన ప్రార్థన వినిపించగనే సాతాను పరివారమంతయు గడగడ వణకును. తన ఆశయమును సాధించుటకు దష్టదూతగణముల నాతడ పిలచును. సర్వశక్తిగల దూతలు పరలోకతను త్రాణమును ధరించుకొని మూర్ఛిల్లుఉన్న తరుమబడుచున్న ఆత్మకు సాయమ చేయుటకు రాగానే తమకు ఓటమి కలిగినదని గ్రహించి సాతానుడును అతని దూతలును పలాయితలగుదురు. సాతాను అనుయాయులు ఏకైక లక్ష్యసాధనకు సహకరింతురు. తమలో తమకు సమైక్యతలేకున్నను తమ ఆశయమును కొనసాగించుటకు వారు ప్రతి తరుణమను సద్వినియోగ పరచెదరు. కాని పరలోక భూలోక సేనాధిపతి సాతాను శక్తిని పరిమితమ చేసెను. 11T 345,346; CChTel 475.3