Go to full page →

ఉద్రిక్తతతో కూడిన మతమును గూర్చిన హెచ్చరిక CChTel 484

నియమమునందు బలముగ నుండి సత్యమును స్పష్టముగా గ్రహించగలిగి ఆధ్యాత్మిక మనస్తత్వము గల మనుజులు ఇప్పుడు దేవుని సేవకు అవసరము. CChTel 484.2

ప్రజలకు కావలసినవి నూతన, వింత సిద్ధాంతములు కావని నేను ఉపదేశించబడితిని. వారికి మానవుల ఉహాగానములు అక్కరలేదు. సత్యమును ఎరిగి దాని ప్రకారము జీవించు వ్యక్తుల యొక్కయు, తిమోతీకి ఇయ్యబడిన యీ యాజ్ఞను గ్రహించి దానికి విధేయులగు వ్యక్తుల యొక్కయు సుక్షేము కొరకు అవసరము. వాక్యమును ప్రకటించుము. సమయమునందును అసమయమునందును ప్రయాస పడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖడిరచుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనలు హితబోధను సహింపక దురద చెవులుకల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగుచేసికొన సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపుకును తిరిగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమ పడుము. సువార్తికుని పని చేయుము. నీ పరిచర్య పంపూర్ణముగా జరిగించుము. 2తిమోతి 4. 2`5. CChTel 484.3

మీ పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సును జోడు తొడుగుకొని నిలకడగా, నిశ్చయతతో నడువుడి, పవిత్రమైన, అపవిత్రము కాని మతము ఉద్రిక్తతో కూడిన మతము కాదని మీరు గ్రహించవచ్చును. ఊహా జనిత సిద్ధాతములను సూత్ర. ములను ప్రోత్సహించు భారము దేవుడెవరిపైని మోపలేదు. సహోదరులారా, వీనిని మీరు బోధించకుడి. మీ యనుభవములోనికి వీనిని ప్రవేశింప నీయకుడి. వీని వలన మీ జీవితకర్తవ్యము కళంకితము కానీయకుడి. 68T 294, 295; CChTel 484.4