Go to full page →

దేవుని దండనలు CChTel 499

మనము లోకాంతమును సమీపించు చున్నాము. లోకముపై దేవుని దండనలు పడనారంభించినవని నాకు చూపబడెను. సంభవించుచున్న సంగతుల విషయము దేవుడు మనకు హెచ్చరిక నిచ్చెను. ఆయన వాక్యము నుండి వెలుగు ప్రకాశించుచున్నది. అయినను భూమిని చిమ్మచీకట్లు కప్పుచున్నవి. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. “లోకులు నెమ్మదిగా నున్నది, భయమేమియు లేదని చెప్పుకొను చుండగా.. . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు.”65T 99; CChTel 499.2

ప్రభువు తన నిషేధములను భూమి మీద నుండి తీసివేయు చున్నాడు. ఉ్నత స్థానము లాక్రమించిన ధనికులను, ఖూనీలకు, అఘాయిత్యములకు అధికముగా గురిచేయును తుదకు మరణము, నాశనము సంభవించును. దేవుని కాపుదల లేనివారు ఏ స్థలమునందున్నను ఏ యుద్యోగమునందున్నను వారికి క్షేమముండదు. గాయపరచుటకు, నాశనము చేయుటకు శక్తివంతములైన యంత్రములను కనుగొనుటకు మానవులు తమ మేధస్సును ఉపయోగించుటకు తర్బీతు చేయబడుచున్నారు. 78T 50; CChTel 499.3

దేవుని ప్రతిదండనలు భువిపై పడుచున్నవి. యుద్ధములు, యుధ్ధసమాచారములు, అగ్ని వలన, వరదల వలన కలుగు నాశనము అంత్య దినములలో అధికమగు శ్రమకాలము చాల సమీపముగ నున్నదని స్పష్టముగా తెల్పుచున్నవి. CChTel 499.4

త్వరలో లోక రాజ్యముల మధ్య భయంకరములగు కష్టములు ఉప్పతిల్లును. ఈ కష్టములు క్రీస్తు వచ్చు వరకు అంతరించవు. పరలోకము నందు తన సింహాసనమును సిద్దము చేసికొని రాజ్యములన్నింటిని ఏలుచ్చున ప్రభువును ,సేవించుచు ముందెన్నటికన్న ఇప్పుడు మనమేక్కువ సమైక్యతతో పురోగమించ వలెను. దేవుడు తన ప్రజలను ఎన్నడును విడువలేదు. ఆయనను విడువకుండుటయే మనకు బలము. 83TT 286. CChTel 500.1