Go to full page →

పరలోక విషయములను గూర్చి తలంచుట చర్చించుట క్రైస్తవులకు పరమానందము CChTel 512

పరమందు దేవుడు సర్వాధికారి. అక్కడ పరిశుద్ధత పాలన చేయును. దేవునితోటి సంపూర్ణ సమైక్యతను చెరచుదేమియు అక్కడ ఉండదు. వాస్తవముగా మనము కూడా ప్రయాణించుచున్నచో ఇక్కడ మన హృదయములలో దైవాత్మ నివసించును. కానీ ఇప్పుడు పరలోక సంగతుల ధ్యానమందు మనకానందము లేకున్నచో, దైవజ్ఞానాన్వేషణమందు మన కాసక్తి లేకున్నచో, క్రీస్తు శీలమును చూచుట యందానందము లేకున్నచో, పరిశుద్ధత మనకు ఆకర్షణీయముగా లేకున్నచో, అప్పుడు మనము పరలోకమును గూర్చి నిరీక్షించుట వ్యర్థము. CChTel 512.3

దైవ చిత్తమునకు సంపూర్ణముగా కట్టుబడి యుండుటయే క్రైస్తవుని నిత్యాశయమై యుండవలెను. దేవుని గూర్చియు, యేసుని గూర్చియు, తనను ప్రేమించిన వారికి క్త్రీస్తు సిద్ధము చేసిన పరిత్రతను గూర్చియు, అతడాశించును. దేవుని శుభప్రదమైన వాగ్దానములను గూర్చి ఆత్మ స్మరించుటయు ఈ అంశములను గూర్చిన ధ్యానమును రాబోవు ప్రపంచ శక్తులను రుచిచూచుటయే అని అపొస్తలుడు వివరించు చున్నాడు. CChTel 513.1

మహా సంఘర్షణలో అంతిమభాగము మనముందే యున్నది. అప్పుడు “సర్వశక్తితోను, అబద్ధపు సూచనలతోను, అనీతితో కూడిన మోసముతోను” పనిచేయుచు “సాధ్యమైనచో ఎన్నుకొనబడిన వారిని సైతము మోసగించి, పాడుచేయుటకు” గాను సాతానుడు దైవ శీలమునకు అపురూపము కల్పింప చూచును. పరలోకము నుండి నిత్య ప్రవర్ధమానముగా వచ్చు వెలుగు అవసరమైన ప్రజలెవరైన ఉన్నచో వారు అపాయకరమైన యీ కాలములో తన పరిశుద్ధ ధర్మశాస్త్రమునకు నిధులుగా నుండి తన శీలమును ప్రపంచమునకు నిరూపించుటకు గాను దేవుడు పిలిచిన ప్రజలే. ఇంత పవిత్రత నిధి ఎవరికి ఇయ్యబడినదో వారు తాము నమ్ము సత్యములచే భక్తి పరులుగా రూపొందించబడి సమున్నత పర్చబడి బలపర్చబడవలెను. 115T 745, 746; CChTel 513.2