Go to full page →

పరలోక సంఘముతో ఐక్యత CChTel 150

దేవుని భూలోక సంఘము ఆయన పరలోక సంఘముతో ఏకస్థమై యున్నది. భూలోకమందలి విశ్వాసులును ఎన్నడును పాపము చేయని పరలకవాసులును ఒక సంఘమై యున్నారు. దేవుని నారాధించుటకు భూమిపై పరిశుద్ధులు జరుపు సభలయందు పరలోకవాసులు అమితాసక్తులై యుందురు. ఏలయనగా తప్పిపోయిన ఆదాము కుమారుల కొరకు క్రీస్తు మరణము వ్యర్థము కాలేదని భూలోక ఆవరణమందు పరిశుధ్ధులు చేయు స్తుతి వందనార్పణలు పరలోకపు లోపలి ఆవరణములోని స్తుఇ గానములతో మిళితమై వినబడుచుండెను. దేవదూతలు జీవపు ఊటలోని నీళ్లు త్రాగుచుండగా, భూలోకమందలి భక్తులు సింహాసనము నుండి ప్రవహించుచు దైవ పట్టణమును సంతోషపరచు పవిత్ర జలములను గ్రోలెదరు. CChTel 150.2

పరలోక భూలోక సామీప్యమును మనమెల్లరము గ్రహింతముగాక! భూలోకవాసులకు గ్రాహ్యము కాకున్నను, వెలుగు దూతలు వారకి సహవాసులై యున్నారు. జీవించు ప్రతి వ్యక్తికి, జీవికి ఆత్మను క్రీస్తు చెంతకు చేర్చుటకు ఒక నిశ్వబ్ద సాక్షి కావలి యుండును. నిరీక్షణ యున్నంతకాలము అనగా మానవులు పరిశుద్ధాత్మను తిరస్కరించుట వలన తమ స్వకీయ నాశనము తెచ్చుకొనువరకు దేవదూతలు మానవులను కాపాడెదరు. భూలోకమందు పరిశుద్ధుల ప్రతి సమావేశమందును దేవ దూతలుండి వారి సాక్ష్యములను గానములను, ప్రార్థనలను ఆలకింతురని జ్ఞాపకముంచుకొందుము. మన స్తుతి గీతములను మీది దూతల గాన సభలు పూరించునని జ్ఞాపముంచుకొందము. CChTel 150.3

ప్రతి సబ్బాతు దినమున మీరు సమావేశమగునపుడు చీకటిలో నుండి యీ గంభీరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ప్రభువుకు స్తుతి గీతములు పాడుడి. “మనలను ప్రేమించి తన రక్తమందు మన పాపములను కడిగిన వానికి” హృదయ పూర్వకమగు స్తుతి మహిమలు చెల్లింతము. క్రీస్తు ప్రేమను గూర్చి బోధకుడు ప్రసంగించవలెను. ప్రతి స్తుతి కీర్తనయందును ఆయన ప్రేమ సులభమగు భాషలో వ్యక్తము చేయబడవలెను. మీ ప్రార్థన లను దైవాత్మ ప్రేరణ వలన కలుగవలెను. జీవ వాక్యము బోధింపబడగా పరలోక సందేశముగా దానిని మీరు పొందినట్లు మీ పాృదయ పూర్వక ప్రత్యుత్తరము ద్వారా సాక్షమీయుడి. CChTel 150.4

సంపూర్ణ ప్రేమా గుణగణములను అలవరచుకొను నిమిత్తము తన ఆలయమందు మనము సమావేశము కావలెన దేవుడుపదేశించుచున్నాడు. ఆయన ను ప్రేమించు వారందరికి ఆఆయన సిద్ధము చేయుచున్న భవనములందు నివసించుటక లోకవాసులను ఆ ప్రేమ యోగ్యులుగా చేయును. సింహసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు నిత్యము గంభీర గానము చేసి స్తుతివందనములు చెల్లించు నిమిత్తము ప్రతి సబ్బాతు దినమును ప్రతి అమావాస్య నాడు వారు మందిర మందు సమావేశమగుదురు. 46T 366-368; CChTel 151.1