Go to full page →

దేవుని ప్రత్యక్ష సన్నిధిలోనున్నట్లు ప్రవర్తించుడి CChTel 165

దేవుని సముఖములో నున్నామను భావము ఆయన అనంత ఔనత్యమును గుర్తింపగల విజ్ఞానము ఆయన యెడల పూజ్యభావము నుద్రేక పర్చును. అదృశ్య గూర్చిన యీ జ్ఞానము ప్రతి హృదయము లోను నెలకొల్పబడవలెను. ప్రార్ధన సమయమును, స్థలమును పవిత్రమైనవి. కారణమేమనగా దైవసన్నిధి అచ్చట కలదు. వైఖిరి యందును పూజ్య భావము ప్రదర్శింతము, కాగా భావమును పుట్టించు చిత్తవృత్తి గంభీరమగును.” ఆయన నామము పరిశుద్ధ మైనది, పూజింపదగినది.” అ గాయకడు పలుకుచున్నాడు. (కీర్తనలు 111:9. )3GW 176-178; CChTel 165.1

కూటము ప్రార్ధన తో ప్రారంభమైనపుడు పరిశుద్ధ దేవుని సన్నిధానములో ప్రతి మోకాలు వంగవలెను. ప్రతి హృదయము మౌన ప్రార్ధన ద్వారా దేవుని కడకు వెళ్ళవలెను. వాక్యముద్వారా జరిగిన సేవ పలభరితమగును. వాక్యము వలన ఎక్కవ మేలు కలుగక పోవుటకు ఒక గొప్ప కారణము దేవుని మందిరమందు ఉపాసకలు ప్రదర్వించుచున్ననిర్జీవ మనస్తత్వమే. అనేక హృదయములలోనుండి బయటపడి ఒక సుస్పష్ట ప్రత్యేక స్వరముగా రూపొందు మధురగానము ఆత్మలను రక్షించుటలో దేవుడుపయోగించు సాధనములలో నొకటి. కూటములకు కర్తయగు ప్రభువు ప్రత్యక సన్నిలో నునట్లే ఆరాధన యంతయు గంభీరతతోను, భక్తితోను జరుపబడవలెను. CChTel 165.2

సహోదరులారా! బోధకుడు ప్రసంగించునపుడు మీరు దేవుని స్వరమును ఆయన ప్రతినిధి ద్వారా వినుచున్నారని జ్ఞాపకముంచుకొన వలెను. జాగ్రత్తగా ఆలకించుడి. ఒక నిమిషమైనను నిద్రించకుడి. ఏలయన గా నిద్రవలన అత్యవసరమైన వాక్యమును మీరు పొగొట్టుకొనిన వచ్చును. వాక్యమునకు మీరు చెవినిచ్చి యునచో అది తప్పు త్రోవల నుండి మీ మీ పాదములను మళ్లించి యుండునేమో! హితవు, హెచ్చరికలు , గద్దింపులు వినబడ కుండునట్లు , ఒక వేళ వినబడినను వారి వలన హృదయము , తద్వారా జీవితము మారకుండనట్లు సాతానుడును తన దూతలును మానవసిక శక్తులను స్థంభింపజేయవలెన కృషిచేయు చున్నారు. కొన్నిసార్లు వినువారు ఒక చంటిబిడ్డచే ఆకర్షించబడి యుండగా విలువగల విత్తనములు మంచినేలను పడనికారణముగా ఫలించక యుండుట తటస్థించును. కొన్నిసార్లు యువకులు, యువతులు దైవమందిరముపట్ల, దైవారాధనపట్ల, గౌరవభారమును చూపక ప్రసంగము జరుగుచున్నపుడు ఒకరు నొకరు అదేపనిగా వీక్షించుకొందురు. దేవదూతలు వారిని చూచుట, వారి క్రియలను గుర్తించుట, వారు చూడగలిగినచో సిగ్గుపడి వారు తమ్మును తాము ఏవగించు కొనెదరు. శ్రద్ధగా వినువారినే దేవుడు కోరుచున్నాడు. మనుష్యులు నిద్రించునపుడే సాతామడు గురుగులు చల్లెను. CChTel 165.3

చివరి ఆశీర్వచనము చెప్పబడిన పిమ్మట క్రీస్తు సమాచారము పొగొట్టు కొందుమేమోయను భీతికలిగి యున్నట్లు అందరును మౌనముగా నుండవలెను. దేవుని సముఖము నందున్నామనియు, దేవుడు తమను చూచుచున్నాడనియు, గ్రహించి అందరును నిశ్శబ్దముగా బయటికి వెళ్లవలెను. పిచ్చాపాటి చెప్పుకొనుటగాచి, మందిరములోని మార్గములో నెవరును ఆగరాదు. ఇది ఇతరులకు ఆటంకముగా నుండును. దేవాలయ మావరణము పవిత్ర భక్తి భావముతో నిండియుంగవలెను. పాతస్నేహితులను కలసికొనుటకుగాని, సామాన్యమైన అల్లరి చిల్లరి తలంపులు తలంచుటకుగాని, లోకవ్యవహారములు చక్కబెట్టుకొనుటకుగాని, అఇస్థలముకాదు. ఇవన్నియు దేవాలయము అవతల విడువ వలసిన సంగతులు, కొన్ని స్థలములలో వినబడు నిర్లక్ష్యపు నవ్వు, పాదముల చప్పుడు వలన దేవుడును, ఆయన దూతలును పరాభవింప బడుచున్నారు. CChTel 166.1