Go to full page →

5వ అధ్యాయం - సమర్పణ SCTel 34

“మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు” (యిర్మియా 29:13). ఇది దేవుని వాగ్దానం. SCTel 34.1

సంపూర్ణ హృదయం దేవునికి సమర్పితం కావాలి. లేకపోతే మనల్ని ఆయన పోలికకు పునరుద్దరించే మార్పు మనసులో ఎన్నడూ చోటుచేసుకోదు. స్వభావ సిద్ధంగా మనం దేవునికి దూరంగా ఉంటున్నాము. మన పరిస్థితిని పరిశుద్ధాత్మ ఇలాంటి పదజాలంతో వర్ణిస్తున్నాడు. “అపరాధములచేతను, పాపములచేతను, చచ్చినవారు, స్వస్తత కొంచెమైనను లేదు” “సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన” మనం సాతాను ఉచ్చులో బంధింపబడి ఉన్నాం. (ఎఫెసి 2:1, యెషయా 1:5,6; 2తిమోతి 2:26) మనల్ని స్వస్థపర్చాలని, మనకు విడుదలకలిగించాలని దేవుడుఅభిలషిస్తున్నాడు. దీనికి పూర్తి ప్రవర్తన, సంపూర్ణ స్వభావనవినీకరణ అవసరం. కనుక మనల్ని మనం దేవునికి పూర్తిగా అంకితం చేసుకోవాలి. SCTel 34.2

సాతాను ప్రచారం చేస్తున్నట్లు, దేవుని ప్రభుత్వం గుడ్డివిధేయత, అర్ధం పర్ధంలేని నియంత్రణల మీద స్థాపితమైందికాదు. అది ప్రజ్ఞలను మనస్సాక్షిని ఆకట్టుకొంటుంది. తాను సృజించిన నరులకు సృష్టికర్త అందిస్తున్న ఆహ్వానంఇది. “రండి మన వివాదమును తీర్చుకొందము” (యెషయా 1:18), తాను సృజించిన మనుషుల చిత్తాన్ని దేవుడు ఒత్తిడి చేయడు. ఇష్టపూర్వకంగాను రాని స్తుతి వందనాన్ని ఆయన అంగీకరించలేడు. ఒత్తిడి సాధించే విధేయత యధార్ధమైన మానసిక వికాసాన్ని, ప్రవర్తనాభివృద్ధిని ఆటంక పర్చుతుంది. అది మానవుణ్ణి ఒక యంత్రంగా మార్చుతుంది. అది సృష్టికర్త ఉద్దేశం కానేకాదు. సృష్టికి మకుటమెన్ల మానవుడు అభివృద్ధిసాధనలో ఉన్నత శిఖరాలు చేరాలని దేవుడు కోరుతున్నాడు. మనముందు అత్యున్నత దీవెనను ఉంచి తన కృప ద్వారా దాన్ని పొందడానికి మనల్ని నడిపించాలని అభిలషిస్తున్నాడు. మనయందు తన చిత్తం నెరవేరేందుకుగాను మనం తనకు సమర్పించుకోవల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవుని కుమారుల ఉజ్వల స్వాతంత్ర్యాన్ని పంచుకునేందుకు గాను దాస్యం నుంచి స్వేచ్ఛ పొందడమో లేదో ఎంపిక చేసుకోవలసింది మనమే. SCTel 34.3

మనల్ని మనం దేవునికి సమర్పించుకొన్నప్పుడు మనల్ని ఆయనకు దూరం చేసే సమస్తాన్ని విడిచిపెట్టాలి. అందుచేత రక్షకుడిలా అంటున్నాడు, “మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టినవాడు నాశిష్యుడు కానేరడు” (లూకా 14:33) హృదయాన్ని పెద్ద విషయాల నుంచి ఏది మళ్ళిస్తుందో దాన్ని మనం విడిచిపెట్టాలి. పెక్కుమందికి ధనం ఒక విగ్రహం. ధనాశ అనే బంగారు సంకెళ్ళతో వారు సాతానుకు బంధీలవుతారు. ఇంకో తరగతి ప్రజలు పలుకుబడిని లోక ప్రతిష్టను పూజిస్తారు. ఇంకా కొందరికి స్వార్ధ విలాస జీవితం, బాధ్యతారాహిత్య ఆరాధ్య విగ్రహాలు. ఈ బానిస బంధాలు తెగిపోవాలి, సగం ప్రభువుకి సగం ప్రపంచానికి చెందడం సాధ్యంకాదు. మనం పూర్తిగా దేవునికి చెందకపోతే ఆయన పిల్లలం కానేరము. SCTel 35.1

ఆయన ధర్మ శాస్త్రాన్ని ఆచరించటానికి, సత్సప్రవర్తనను సాధించి రక్షణ సంపాదించడానికి, తమ సొంత కృషిమీద ఆధారపడుతూనే మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునేవారున్నారు. క్రీస్తు సేవాస్పూర్తి వారి హృదయాల్ని చెత్తన్య పర్చదు. కాని పరలోకాన్ని సంపాదించుకునేందుకుగాను దేవుడు కోరుతున్నట్లుగా క్రైస్తవ విధుల్ని నెరవేర్చడానికి కృషి చేస్తారు. అలాంటి భక్తి నిరర్ధకం. హృదయంలో క్రీస్తు నివశించి నపుడు ఆయనయందు నిలిచి ఉండేందుకుగానుఆత్మ ఆయన ప్రేమతో, ఆయన సహవాస ఆనందంతో నిండి ఉంటుంది. ఆయన ధ్యానంలో స్వార్ధం మరుగున పడిపోతుంది. క్రీస్తుమీద ప్రేమే క్రియలకు ఉత్పత్తి స్థానమవుతుంది. బలవంతంచేసే దైవ ప్రేమను అనుభవపూర్వకముగా గ్రహించేవారు దేవుని విధుల్ని ఆచరించడానికి ఎంత తక్కువ వ్యయ ప్రయాసలు అవసరమని విచారణ చేయరు; అతి తక్కువ ప్రమాణం కోరరు. కాని రక్షకుని చిత్తానికి అనుగుణంగా పరిపూర్ణ త్యాగాన్ని కాంక్షిస్తారు. చిత్తశుద్ధితో తమ సమస్తం సమర్పించి తాము వెదుకుతున్న వస్తువు విలువకు ధీటైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. ప్రగాఢమైన ఈ ప్రేమలేకుండా క్రీస్తుని విశ్వశిస్తున్నామంటే అది వ్యర్ధ ప్రసంగం. సారంలేని ఆచారం, భారమైన కృషి, SCTel 35.2

మీ సర్వస్వాన్ని క్రీస్తుకు అప్పగించటం గొప్ప త్యాగమని మీరనుకుంటారా? “యేసు నాకోసం ఏమి త్యాగం చేసాడు? “అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దైవ కుమారుడు తనకున్నదంతా - జీవితం, ప్రేమ, శ్రమలు, కష్టాలు- మన విమోచన కోసం ఇచ్చాడు. ఇంత గొప్ప ప్రేమకు అయోగ్య లబ్దిదారులమైన మనము మన హృదయాల్ని ఆయనకు సమర్పించకుండా ఉంచుకుంటామా? మన జీవితాల్లో ప్రతి నిమిషం దేవుని కృపాదీవెనలు అనుభవిస్తునేవున్నాం. ఈకారణంగా ఎంత అజ్ఞానం. దుస్థితినుంచి రక్షించబడ్డామోమనంపూర్తిగా గ్రహించజాలము. ఎవరిని మన పాపాలు గాయపర్చాయో అయినా ఎవరి ప్రేమను, ప్రాణ త్యాగాన్ని మనం ద్వేషించామో ఆ ప్రభువును మనం చూడగలమా? మహిమా ప్రభువు పొందిన సిగ్గును వరాభవాన్ని దృష్టిలో ఉంచుకుని, పోరాటం, ఆత్మనిరసనలద్వారానే జీవంలో ప్రవేశించగలం. గనుక మనంసణుగుకొందామా ? SCTel 36.1

గర్వంతో నిండిన అనేకులు ఇలా ప్రశ్నిస్తున్నారు. ‘’దేవుడు నన్ను అంగీకరిస్తాడన్న నిశ్చయత పొందకముందే పశ్చాత్తాపంతో దీనత్వంతో నేను ఆయన వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను మీకు క్రీస్తును చూపిస్తున్నాను. ఆయన పాపరహితుడు. ఇంకా చెప్పాలంటే ఆయన పరలోక రాజు. అయినా మానవుడి స్థానంలో మానవ సంతతికోసం ఆయన పాపమయ్యాడు” అతి క్రమము చేయువారీలో ఎంచబడినవాడాయెను. అనేకుల పాపములు భరించెను. తీరుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపన చేసెను. (యెషయా 53:12). SCTel 36.2

మనకు సమస్తాన్ని ఇచ్చిన పుడు మనం త్యాగంచే స్తున్నదేమిటి? శుద్దీకరించడానికి, తన స్వకీయ రక్తంతో కడగడానికి, తన అపారప్రేమతో రక్షించడానికి యేసుకు మనమిచ్చేది మన పాప కలుషిత హృదయం. అయినప్పటికీ సమస్తాన్నివ్వడం మనుషులకు కష్టమనిపిస్తుంది. ఇది వినడనికి రాయడానికి సిగ్గుగావుంది. SCTel 36.3

మనకు మేలు చేసేది ఏదీ మనం విడిచిపెట్టాలని దేవుడు కోరడంలేదు. దేవుడు ఏమి చేసినా అది తన బిడ్డల క్షేమాభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే చేస్తాడు. తాము వెదుకుతున్నదానికన్నా యేసు ఇస్తున్నది ఎంతో మెరుగైనదని క్రీస్తును ఎంపిక చేసుకోకుండా ఉన్న వారందరు గుర్తించటం మంచిది. దేవునికి చిత్తానికి విరుద్దంగా ఆలోచించటం, వ్యవహరించటం, చేసినప్పుడు మానవుడు తన సొంత ఆత్మకు తీవ్ర హాని, తీవ్ర అన్యాయం చేసుకుంటున్నాడు. దేవుడు ఏది ఉత్తమమో ఎరిగినవాడు. ఆయన తాను సృజించినవారికి మేలు కలిగేందుకు ప్రణాళికలు రూపకల్పన చేస్తాడు. ఆయన నిషేధించిన మార్గం నిజమైన ఆనందాన్నిచ్చే మార్గంకాదు. అతిక్రమణ మార్గం దుఃఖం, నాశనానికి నడిపించే మార్గం. SCTel 36.4

తన బిడ్డలు బాధపడుతుంటే చూడడం దేవునికి ఆనందమన్న ఆలోచనను రానీయడం తప్పు. మానవుడి సంతోషంలో పరలోకమంతా ఆసక్తి చూపుతుంది. మన పరలోక జనకుడు తన బిడ్డలో ఎవరి సంతోషానికి అంతరాయం కలిగించడు. కాకపోతే బాధలు ఆశాభంగాలు కలిగించి సంతోషానికీ పరలోకానికి తలుపులు మూసేసి వినోదాన్ని విసర్జించాలని దెపై విధులు మనల్ని ఆదేశిస్తున్నాయి. లోక రక్షకుడు మనుషుల్ని వారున్న స్థితిలోనే వారి కోరికలతో, పొరపాట్లతో, బలహీనతలతో అంగీకరిస్తాడు. తన రక్తంద్వారా పాపంనుంచి శుద్ధిచేసి విమోచన చేయడమేగాక, తన కాడిని మోయడానికి, తన భారాన్ని భరించడానికి ఇష్టపడేవారందరి హృదయ వాంఛల్ని నెరవేర్చుతాడు. జీవాహారానపేక్షించి తన వద్దకు వచ్చేవారందరికి శాంతిని, విశ్రాంతిని అనుగ్రహించడమన్నది ఆయన ఉద్దేశం. అవిధేయులు ఎన్నడూ చేరజాలని ఉన్నత శిఖరాలకు నడిపించే విధులనే మనం నెరవేర్చవలసిందిగా ఆయన కోరుతున్నాడు. అంతరంగంలో క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉండడమే ఆత్మ పరంగా వాస్తవమెపై ఆనందదాయకమైన జీవితం. SCTel 37.1

“దేవునికి నన్ను నేను ఎలా సమర్పించుకోవాలి? అని అనేకమంది అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలన్నది మీకోరిక. కాని నైతికంగా మీరు బలహీనులు, సందేహానికి బానిసలు; పాప జీవిత దురభ్యాసాల గుప్పెట్లో సతమతమౌతున్నారు. మీ వాగ్దానాలు, తీర్మానాలు నీటిమూటలు. మీ ఆలోచనలు, భావోద్రేకాలు, అనురాగాలు అదుపులోవుండవు. మీ భగ్నవాదాలు, నెరవేరని హామీలు, మీ నిజాయితీని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే దేవుడు మిమ్మల్ని అంగీకరించడన్న సందేహం కలిగిస్తాయి. కాని మీరు నిస్పృహచెందనక్కరలేదు. మీరు గ్రహించాల్సిందల్లా చిత్తానికున్న యధార్ధమెన్ల శక్తి. ఇది మానవ స్వభావాన్ని అదుపుచేసే శక్తి. తీర్మానం, ఎంపిక చేసేశక్తి. చిత్తం యొక్క సక్రమ చర్యమీద సమస్తం ఆధారపడి ఉంటుంది. మానవులకు దేవుడు ఎంపిక శక్తినిచ్చాడు. ఆ శక్తిని వారు ఎంపిక చేసుకోవలసియున్నారు. మీరు మీ హృదయాన్ని మార్చుకోలేరు. హృదయంలో పుట్టే అనురాగాన్ని మీకె మీరు దేవునికి ఇవ్వలేరు. కాకపోతే మీరు ఆయనను సేవించడానికి ఎంపిక చేసుకోవచ్చు. మీ చిత్తాన్ని ఆయనకు సమర్పించవచ్చు. అప్పుడు మీరు ఇచ్చయించడానికి కార్యసిద్ధి కార్య సిద్ధి కలుగజేసుకోవడానికి ఆయన మీలో పనిచేస్తాడు. ఇలా స్వభావమంతా పరిశుద్ధాత్మ నియంత్రణ క్రిందికి వస్తుంది. మీ ప్రేమానురాగాలు ఆయనపై కేంద్రీకృతమౌతాయి. మీ ఆలోచనలు, ఆయన చిత్రానికి అనుగుణంగా ఉంటాయి. SCTel 37.2

నీతిగా పరిశుద్ధంగా నివశించాలన్న కోరిక మంచిదే. అయితే మీరిక్కడ ఆగిపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. క్రైస్తవులుగా ఉండాలని నిరీక్షిస్తూ ఆశిస్తూ ఎంతో మంది మరణిస్తారు. చిత్తాన్ని దేవునికి సమర్పించే వరకు రారు. క్రైస్తవులుగా ఉండడానికి ఇప్పుడే ఎంపిక చేసుకోరు. SCTel 38.1

చిత్తాన్ని స్వయంగా వినియోగిచటం ద్వారా మీ జీవితమంతా మార్చు చెందవచ్చు. మీ చిత్తాన్ని క్రీస్తుకు సమర్పించటం ద్వారా సర్వ ప్రధానులకు అధికారులకన్నా ఉన్నత శక్తి తో మీకు స్నేహ సంబంధం ఏర్పడుతుంది. మిమ్మల్ని స్థిరంగానిలిపే శక్తి నుంచి వస్తుంది. ఈ ప్రకారం నిత్యం దేవునికి సమర్పించుకోవడం వల్ల నూతన జీవితం అదే విశ్వాస జీవితం జీవించేందుకు మీకు శక్తి చేకూరుతుంది. SCTel 38.2