వైద్యమిషనెరీ సేవ జరిగే స్థలాలన్నిటిలోను వంట పాఠశాలలు నడిపించటానికి ప్రోత్సహించాలని నేను ఉపదేశించబడ్డాను. ప్రజల్ని సంస్కరణకు నడిపించటానికి ప్రతీ ప్రేరణను ఇవ్వాలి. సాధ్యమైనంత వెలుగు వారిపై ప్రకాశింపజెయ్యాలి. ఆహారం తయారు చెయ్యటంలో మెరుగైన మార్గాల్ని వారికి నేర్పించి, తాము నేర్చుకున్నది ఇతరులతో పంచుకోటానికి వారిని ప్రోత్సహించండి. గాసిపుల్ వర్కర్స్, పులు. 362, 263. ChSTel 162.1
వంట పాఠశాలల్ని జరిపించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటం ప్రజలకు నేర్పించాలి. అనారోగ్యదాయకమైన ఆహారాన్ని విసర్జించాల్సిన అవసరాన్ని వారికి చూపించాలి. కాని మనం ఆకలి తీర్చని ఆహారాన్ని ప్రబోధించకూడదు. టీ, కాఫీ, మాంసం ఉపయోగించకుండా ఆరోగ్యదాయకం బలవర్ధకం అయిన ఆహారం భుజించవచ్చు. ఆరోగ్యకరం రుచికరం అయిన ఆహారం ఎలా తయారు చెయ్యాలో ప్రజలకు నేర్పించే సేవ మిక్కిలి ప్రాముక్యమైన సేవ. టెస్టిమొనీస్, సం. 9, పు. 112. ChSTel 162.2