ఇంటింటికి వెళ్లి ఆసక్తి ఉన్నవారికి బైబిలు పఠనాలు నిర్వహించి వారితో కలిసి ప్రార్థన చేసే సేవ చెయ్యటానికి అనేకులు పిలుపు పొందుతారు. టెస్టిమనీస్, సం. 9, పు. 172. ChSTel 164.3
అనేకమంది పనివారు ఇంటింటికి వెళ్లి కుటుంబాల్లో బైబిలు పఠనాలు జరిపి సేవ చెయ్యటంలో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 141. ChSTel 165.1
తమను ప్రతిష్టించుకున్న స్త్రీలు ఇంటింటికి వెళ్లి బైబిలు సేవ చెయ్యా లి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 120, 121. ChSTel 165.2
మనం క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తుంటే మన పరిచర్య అవసరమైన వారికి మనం చేరువవ్వాలి. మనం బైబిలు తెరిచి వాక్యాన్ని విశదం చెయ్యాలి, దైవ ధర్మశాస్త్ర న్యాయవిధుల్ని సమర్పించాలి, సందేహిస్తున్న వారికి వాగ్దానాల్ని చదివి వినిపించాలి. అజాగ్రత్తగా ఉన్న వార్ని మేలుకోల్పాలి, బలహీనుల్ని బలపర్చాలి. గాస్పుల్ వర్కర్స్, పు. 336. ChSTel 165.3
ఫిలిప్పు - కూషు దేశస్తుడి అనుభవంలో, తన ప్రజలు చెయ్యాల్సిన సేవకు దేవుడు పిలుపు నిస్తున్నాడు. ఆ కూషు దేశస్తుడు, ఫిలిప్పు వంటి మిషనెరీలు అనగా దేవుని స్వరం విని ఆయన ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్లే మిషనెరీలు అవసరమైన ఓ పెద్ద తరగతిని సూచిస్తున్నాడు. లేఖనాలు చదువుతున్న వారు, కాని వాటి భావాన్ని గ్రహించలేని వారు లోకంలో అనేకమంది ఉన్నారు. ఈ ఆత్మలకు వాక్యభావాన్ని విశదం చెయ్యటానికి దేవుని గూర్చి జ్ఞానం కల పురుషులు, స్త్రీలు అవసరం. టెస్టిమొనీస్, సం. 8, పులు. 58, 59 ChSTel 165.4
మన సంఘ సభ్యుల్లో ఇంటింటికి వెల్లి బైబిలు పఠనాన్ని నిర్వహించటం ఎక్కువ జరగాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 127. ChSTel 165.5
పనివారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు బైబిలు విశదం చెయ్యాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 123. ChSTel 165.6
అనేక రాష్ట్రాల్లో నేటి కాలానికి దేవుడు ఉద్దేశించిన సత్యాన్ని ఎరగని ధనిక వ్యవసాయదారుల పారిశ్రామిక స్థావరాలున్నాయి. ఆ స్థలాల్లో పని చెయ్యాల్సిన అవసరముంది. మన స్వచ్చంద సువార్త సేవకులు ఈ సేవా శాఖను చేపట్టాలి. పుస్తకాలు ఎరువివ్వటం ద్వారా, పత్రికలు పంచటం ద్వారా, బైబిలు పఠనాలు నిర్వహించటం ద్వారా మన స్వచ్చంద సువార్త సేవక సభ్యులు తమ పరిసర ప్రాంతాల్లో గణనీయమైన సేవ చెయ్యవచ్చు. ఆత్మల పట్ల ప్రేమ కలిగి ఉంటే అనేకులు మార్పు చెందేంత శక్తిమంతంగా వర్తమానాన్ని ప్రకటించగలుగుతారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 35. ChSTel 165.7