Go to full page →

విచక్షణలేకుండా పంచండి ChSTel 179

బోధకుడి స్వరం వినిపించని స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలానికి ప్రచురణలే - ప్రజలకు అవసరమైన బైబిలు సత్యంతో నిండిన పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు - చేరగలవు. మన సాహిత్యాన్ని ప్రతీచోటా పంచాలి. ఇది లేదా అది ఏది పెరిగి ఫలిస్తుందో ఎరుగం గనుక మనం సమస్త జలాల పక్క విత్తాలి. పొరపాట్లు గల మన ఆలోచనలో మనం సత్యాన్ని సందేహించకుండా ఎవరు అంగీకరిస్తారో వారికి సాహిత్యాన్నివ్వటం అవివేకమని భావించవచ్చు. ఈనాటి సత్యం గురించి ఉపదేశం ఉన్న ఓ కరపత్రాన్ని ఇవ్వటం వల్ల ఏ మంచి ఫలితం వస్తుందో మనకు తెలియదు. సదర్న్ వాచ్ మేన్, జన. 5, 1904. ChSTel 179.1