Go to full page →

దైవ ప్రజల బాధ్యతలు, విధులు ChSTel 188

సువార్త సంఘ సంస్థాపకులు, ఆ తర్వాత గతించిన శతాబ్దాల్లోని సాక్షులు పైకెత్తి పట్టుకున్న సత్యం, మత స్వేచ్చ ధ్వజం ఈ చివరి సంఘర్షణలో దేవుడు మన చేతుల కప్పగించాడు. దేవుడు తన వాక్య జ్ఞానాన్ని ఎవరికిస్తాడో వారి మీద ఈ వరాన్ని గూర్చిన బాధ్యత ఉంటుంది. మనం ఈ వాక్యాన్ని సర్వోన్నతాధికారంగా స్వీకరించాలి. మానవ ప్రభుత్వం దేవుని ఏర్పాటు ప్రకారం నియమితమయ్యిందని గుర్తించి, దాని ఉచిత పరిధిలో దానికి విధేయులవ్వటం మన పవిత్రవిధి అని బోధించాలి. అయితే దాని హక్కులు దేవుని హక్కులతో సంఘర్షించినప్పుడు మనం మనుషుడికన్నా దేవునికి విధేయులమవ్వాలి. మానవ చట్టాలన్నిటికన్నా దేవుని వాక్యం సమున్నమైందిగా మనం పరిగణించాలి. “యెహోవా సెలవిచ్చుచున్నాడు” అన్నదాన్ని పక్కన పెట్టి “సంఘం ఇలా చెబుతుంది” లేక “ప్రభుత్వం ఇలా చెబుతున్నది” అన్నదాన్ని ఆచరించకూడదు. లోకాధికారుల కిరీటాలన్నిటికీ పైగా క్రీస్తు కిరీటాన్ని మనం ఎత్తాలి. ది ఎక్టిన్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 68,69. ChSTel 188.3

ఒక ప్రజగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చెయ్యలేదు. ఆదివారాచరణ చట్టం అమలు తెచ్చే సమస్యకు మనం సిద్ధంగా లేం. ముంచుకు వస్తున్న ప్రమాద సూచనలు చూస్తున్న మనం మేల్కొని చర్యచేపట్టటం మన విధి. ప్రవచనం ముందునుంచే చెబుతుంది గనుక ఈ పని కొనసాగాల్సి ఉందని, ప్రభువు తన ప్రజల్ని కాపాడానని తమని తాము ఓదార్పుకుంటూ ప్రశాంతంగా కూర్చుని ఆ దుర్దినం కోసం ఎవరూ కని పెట్టుకుందురు గాక. మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని కాపాడుకోటానికి ఏమి చెయ్యకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు. ఎంతోకాలంగా నిర్లక్ష్యం చేసిన పనిని పూర్తి చేసే వరకు ఈ విపత్తును ఆపమని దేవుని సన్నిధికి హృదయ పూర్వక ప్రార్ధనలు వెళ్లాలి. హృదయపూర్వక ప్రార్ధనలు మనం ఎక్కువగా చెయ్యాలి. ఆ తర్వాత మన ప్రార్ధనలకి అనుగుణంగా పని చెయ్యాలి. టెస్టిమొనీస్, సం.5, పులు. 713,714. ChSTel 189.1

భయ పెట్టిన ప్రమాదాన్ని నివారించటానికి మనం చెయ్యగిగినదంతా చెయ్యటం మన విధి. ప్రజలముందు మనల్ని మనం సరి అయిన వెలుగులో కనపర్చుకోటం ద్వారా ముందే ఏర్పడ్డ దురభిప్రాయాల్ని తొలగించటానికి ప్రయత్నించాలి. అసలు సమస్యను వారి ముందు పెట్టి, మనస్సాక్షి స్వేచ్ఛను నియంత్రించే చర్యల విషయంలో కలుగజేసుకుని అతి సమర్థ నిరసన చేపట్టాలి. టెస్టిమొనీస్, సం.5, పు. 452. ChSTel 189.2

మనముందున్న అపాయాన్ని చూపించటానికి దేవుడు మనకు వెలుగునిచ్చినప్పుడు, దాన్ని ప్రజల ముందుకి తేవటానికి శాయశక్తుల కృషి చెయ్యకపోతే, ఆయన దృష్టిలో మనం నిర్దోషులంగా ఎలా నిలబడగలుగుతాం? అతిముఖ్యమైన ఈ సమస్యను గురించి హెచ్చరించకుండా దాన్ని ఎదుర్కోటానికి వారిని విడిచి పెట్టటంతో తృప్తి చెందగలమా? టెస్టిమొనీస్, సం.5, పు.712. ChSTel 189.3

జాతీయ సంస్కర్తలు మత స్వేచ్చ నియంత్రణ విషయంలో చర్యకు విజ్ఞప్తి చెయ్యటం మొదలు పెట్టినప్పుడు, మన నాయకులు పరిస్థితిని గ్రహించి దాన్ని వ్యతిరేకించటానికి చిత్తశుద్ధితో కృషిచేసి ఉండాల్సింది. ప్రజలకు అందజెయ్యకుండా వెలుగును నిలుపు చెయ్యటం, అనగా ప్రజలకు అవసరమైన నేటి సత్యాన్ని అందించకుండా ఉండటం దేవుని చిత్తం కాదు. మూడోదూత వర్తమానాన్ని అందిస్తున్న మన వాక్యపరిచారకులందరూ ఆ వర్తమానంలో ఉన్నదానినంతటిని అవగాహన చేసుకున్నవారు కారు. జాతీయోద్యమాన్ని కొందరు ప్రాముఖ్యమైన ఉద్యమంగా భావించటం లేదు గనుక దాన్ని పెద్దగా పట్టించుకోటం లేదని అలా చెయ్యటం ద్వారా తాము మూడోదూత వర్తమానంతో సంబంధంలేని సమస్యలకి సమయం పెట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సత్యానికి అలాంటి భాష్యం చెబుతున్న సహోదరుల్ని ప్రభువు క్షమించును గాక. టెస్టిమొనీస్, సం5, పు. 715. ChSTel 190.1

ఆదివారాచరణ శాసనం వస్తుందని మనం అనేక సంవత్సరాలుగా ఆందోళనతో కనిపెడుతున్నాం. ఆ ఉద్యమం ఇప్పుడు మన ముందుండగా, ఈ విషయంలో మన ప్రజలు తమ విధిని నెరవేర్చుతారా? అని అడుగుతున్నాం. సత్యపతాకాన్ని పైకెత్తటంలోను, మత హక్కుల్ని, ఆధిక్యతల్ని ప్రాముఖ్యమైనవిగా పరిగణించేవారందరినీ ముందుకి రావలసిందని పిలవటంలోను మనం తోడ్పడలేమా? మనుషులకు కాక దేవునికే లోబడటానికి ఎంపిక చేసుకునేవారు హింసకు గురి అయ్యే సమయం వేగంగా వస్తున్నది. మనుషులు ఆయన ఆజ్ఞల్ని కాళ్లతో తొక్కుతుండగా మౌనంగా ఉండటం ద్వారా అప్పుడు మనం దేవున్ని కించపర్చుదామా? తన వైఖరి వల్ల ప్రొటస్టాంటు ప్రపంచం రాముకి రాయితీలిస్తుండగా, మనం మేల్కుని, పరిస్థితిని అవగాహన చేసుకుని, మన ముందున్న పందెం వాస్తవిక స్వరూపాన్ని గుర్తించాలి. కావలివారు ప్రస్తుత కాలానికి దేవుడిచ్చిన సత్య వర్తమానాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు తమ గళమెత్తాలి. ప్రవచన చరిత్రలో మనం ఎక్కడున్నామో ప్రజలకి చూపించి, నిజమైన ప్రొటస్టాంటు స్పూర్తిని మేలుకొలిపి, దీర్ఘకాలంగా మనం అనుభవిస్తున్న ఆధిక్యతలు మత స్వేచ్చ విలువను గుర్తించటానికి లోకాన్ని మేల్కొల్పుదాం. టెస్టిమొనీస్, సం.5, పు.716. ChSTel 190.2

పౌర స్వేచ్ఛకు మత స్వేచ్ఛకు మిక్కిలి ప్రమాదకరమైన ఈ శత్రువు పురోగమనాన్ని ప్రతిఘటించటానికి మనదేశ ప్రజల్ని మేల్కొల్పవలసిన అవసరం ఉంది. స్పిరిట్ ఆఫ్ ప్రోఫసి, సం.4, పు. 382. ChSTel 191.1

ఈ సంక్లిష్ట సంక్షోభంలో మనం చేతులు ముడుచుకుని కూర్చుందామా?.. సంవత్సరాలుగా మనల్ని ఆవరించి ఉన్న మత్తునుంచి మేల్కోటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 18, 1888. ChSTel 191.2