ఈ దినాల్లోని దైవ ప్రజల చరిత్రలో నెహెమ్యా అనుభవం పునరావృతమౌతున్నది. సత్యసువార్త ప్రచార సేవ చేస్తున్నవారు సత్యవిది ఆగ్రహాన్ని రెచ్చగొట్టకుండా పని చెయ్యలేమని గ్రహిస్తారు. తాము చేస్తున్న పనికి తమను దేవుడు పిలిచినప్పటికీ, తాము చేస్తున్న పనిని ఆయన ఆమోదించినప్పటికీ, నిందను ఎగతాళిని వారు తప్పించుకోలేరు. కలలు కనేవారిగా, విశ్వసనీయత లేనివారిగా, కుట్రలు చేసే వారిగా, కపట వేషధారులుగా, తమ కార్యానికి ఏది అనుకూలంగా ఉంటే ఆ పేరుతో వారిని చిత్రించి అభాసుపాలుచేస్తారు. భక్తిహీనుల్ని సందడిపర్చటానికి అతిపవిత్ర విషయాల్ని నవ్వులాట విషయాలుగా చిత్రిస్తారు. అపహాసకుల సందడికి, కాస్త వెటకారం కాస్త చౌకబారు చమత్కారం చాలు. గర్వాంధులైన ఈ అపహాసకులు ఒకరి తెలివికి ఒకరు పదును పెట్టి, తమ దేవదూషణ పనిలో ఒకరికొకరు మద్దతు పలుకుకుంటారు. తిరస్కారం, హేళన మానవ నైజానికి బాధాకరమైన విషయాలు. కాని దేవునికి నమ్మకంగా ఉన్న వారందరూ వాటిని భరించాలి. దేవుడు తమకు అప్పగించిన పనిని చెయ్యకుండా ఆత్మలి ఇలా పక్కకు మళ్లించటం సాతాను విధానం. సదర్న్ వాచ్ మేన్, ఏప్రి. 12, 1904. ChSTel 203.1