దేవునికి నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నవారి నిరంతర కార్యకలాపాలపై చాలా ఆధారపడి ఉంటుంది. ఇందువల్ల తనకు విధేయులైన వారి ద్వారా నెరవేరాల్సి ఉన్న దేవుని సంకల్పాన్ని భంగపర్చటానికి సాతాను పరిపరి విధాలా ప్రయత్నిస్తాడు. కొందరిని తమ సమున్నత, పరిశుద్ద సేవా ధర్మాన్ని విస్మరించేటట్లు, ఈ లోక వినోదాలతో తృప్తి చెందేటట్లు నడిపిస్తాడు. సుఖజీవితానికి అలవాటు పడేటట్లు లేక ఎక్కువ ఐహిక లాభాల కోసం పాటుపడేటట్లు తాము ఎక్కడ ఎక్కువ మేలు చెయ్యగలరో అక్కడ నుంచి వెళ్లిపోయేటట్లు చేస్తాడు. ఇతంల్ని నిరుత్సాహపర్చి, కాఠిన్యం వల్ల హింసవల్ల విధి నిర్వహణ నుంచి పారిపోయటట్లు చేస్తాడు. అలాంటి వారందరి పట్ల దేవుడు కనికరపడతాడు. ఎవరి గొంతు నొక్కటంలో సాతాను సఫలుడయ్యాడో ఆ దైవ ప్రజల్లో ప్రతీ ఒక్కరికి “నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అన్న ప్రశ్న వస్తున్నది. దేవుని దినం కోసం ఒక జనాంగాన్ని సిద్ధం చేసేందుకు, నీవు లోకమంటిలోకి వెళ్లి సువార్త ప్రకటించమని నీకు ఆజ్ఞాపించాను. ఇక్కడెందుకున్నావు? నిన్ను ఎవరు పంపారు? ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 171, 172. ChSTel 213.1
వ్యక్తుల విషయంలోలా కుటుంబాల విషయంలోనూ “ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు?” అన్న ప్రశ్న వస్తున్నది. అనేక సంఘాల్లో దైవ వాక్యంలోని సత్యాల పై ఉపదేశం పొందిన కుటుంబాలున్నాయి. వారు తాము చేగల సువార్త పరిచర్య అవసరమైన స్థలాలకు వెళ్లి నిపిస్తూ తమ ప్రభావ పరిధిని విస్తృత పర్చుకోవచ్చు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 172. ChSTel 213.2