సమావేశమవ్వటానికి గల లక్ష్యం ఏంటి? దేవునికి సమాచారం ఇవ్వటానికా? మనకు తెలిసిందంతా ప్రార్ధనలో చెప్పటం ద్వారా దేవునికి ఉపదేశమివ్వటానికా? తలంపులు భావాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోటం ద్వారా జ్ఞానాభివృద్ధి సాధనకు, ఒకరి నిరీక్షణలు ఆశల్ని ఒకరు తెలుసుకోటం ద్వారా శక్తి, వెలుగు, ధైర్యాన్ని పొందటానికి మనం సమావేశమౌతాం. విశ్వాసంతో చేసే హృదయపూర్వక ప్రార్ధనల ద్వారా మనం మన శక్తికి మూలమైన ప్రభువు నుంచి విశ్రాంతిని బలాధిక్యాన్ని పొందుతాం. టెస్టిమొనీస్, సం. 2, పు. 578. ChSTel 226.3
మన శిబిర సమావేశాలు జరుపుకోటానికి ఇంకో ఉద్దేశం కూడా ఉంది. అవి మన ప్రజల నడుమ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రోది చేయాల్సి ఉంది.... దేవుడు మన చేతులికి మిక్కిలి పవిత్రమైన పనిని అప్పగించాడు. కనుక ఈ సేవకు సమర్ధులమయ్యేందుకు మనం సమావేశమవ్వాలి. లోకంలో దేవుని సేవను వృద్ధి పర్చటంలో, పవిత్ర దైవ ధర్మశాస్త్రం నిజమని నిరూపించటంలో “లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల” గా (యోహాను 1:29) రక్షకుణ్ని సమున్నపర్చటంలో వ్యక్తిగతంగా ఏ పాత్రను నిర్వహించటానికి పిలుపు పొందుతామో మనం అవగాహన చేసుకోవాలి. టెస్టిమొనీస్, సం. 6, పులు. 32,33. ChSTel 226.4
సరిగా జరిపించే శిబిర సమావేశం ఎదురులు, పెద్దలు, పరిచారకులు ప్రభువు సేవను మరింత పరిపూర్ణంగా చెయ్యటం నేర్చుకునే పాఠశాల అవుతుంది. అది పెద్ద చిన్న సంఘ సభ్యులందరు ప్రభువు మార్గాన్ని ఎక్కువ పరిపూర్ణంగా తెలుసుకోటానికి తరుణం పొందే పాఠశాల, ఇతరులికి సహాయం చెయ్యటానికి విశ్వాసులుకి సహాయం చేసే పాఠశాల కావాలి. టెస్టిమొనీస్, సం. 6, పు. 49. ChSTel 227.1
గత సంవత్సరాల్లో మన శిబిర సమావేశాల సంబంధంగా దైవ సేవకులు తమ ప్రశస్త తరుణాల్ని సద్వినియోగ పర్చుకుని మూడోదూత వర్తమాన సత్యాన్ని మన ప్రజలు తమ మిత్రులుకి పరిచయస్తులికి సమర్పించటానికి ప్రయోగాత్మక పద్దతుల్ని ఉపదేశించారు. తాము నివసిస్తున్న సమాజాల్లో స్వయం పోషక మిషనెరీలుగా ఎలా సేవ చెయ్యాలో అనేకమందికి ఉపదేశమివ్వటం జరిగింది. క్రితంలోకంటే మరింత ఉద్రేకంతో, మరింత జ్ఞానంతో సేవ చెయ్యటానికి అనేకులు ఈ సాంవత్సరిక సమావేశాల నుంచి తమ గృహాలకు తిరిగి వెళ్లారు. మన శిబిర సమావేశాలకి హాజరయ్యే సంఘ సభ్యులికి ఈ ప్రయోగాత్మక ఉపదేశం గత సంవత్సరాల్లో సామాన్యంగా ఇచ్చినర దానికన్నా ఎక్కువ ఇవ్వటం దేవునికి ఆనందం కూర్చుతుంది. మన సాంవత్సరిక సమావేశాల ముఖ్యోద్దేశాల్లో ఒకటి వ్యక్తిగత మిషనెరీ సేవ చెయ్యటానికి అందరూ ప్రయోగాత్మక పద్ధతులు నేర్చుకోవాలన్నదని ప్రతీ కాన్ఫరెన్సులోని సామాన్య పనివారు, మన సహోదరులు సహోదరీలు జ్ఞాపకముంచుకోవాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 81. ChSTel 227.2
మన కాన్ఫరెన్సుల్లో కొన్ని కాన్ఫరెన్సుల నాయ కులు ఈ ప్రయోగాత్మక ఉపదేశ పద్ధతుల్ని ప్రవేశపెట్టటానికి వెనకాడుతున్నారు. కొందరు ఉపదేశించేబదులు ప్రసంగిస్తారు. కాని మన సాంవత్సరిక శిబిర సమావేశాల వంటి సమయాల్లో విశ్వాసులికి తాము నివసించే స్థలాల్లో ఆచరణీయ మిషనెరీ సేవ చెయ్యటానికి ఉపదేశించటానికి వచ్చే అవకాశాల్ని విస్మరించకూడదు. టెస్టిమొనీస్, సం. 9, పు. 82. ChSTel 227.3