శిబిర సమావేశాలు ఏర్పాటుచేసి జరిపించటానికి చాలా ఖర్చవుతుంది. సిలువ మరణం పొందిన విమోచకుని కృపావర్తమానాన్ని పతనమైన పాపులుకి అందించటానికి ప్రజాదరణ లేని సత్యాన్ని ప్రబోధించే దైవ వాక్య పరిచారకులు ఈ బృహత్ సమావేశాల్లో కష్టపడి పనిచేస్తారు. ఈ సమావేశాల్ని నిర్లక్ష్యం చెయ్యటం లేక ఈ సందేశాల్ని చులకనగా తీసుకోటం దేవుని కృపను ఆయన హెచ్చరికని, విజ్ఞాపనని నిర్లక్ష్యం చెయ్యటమౌతుంది. ఈ సమావేశాలకు మీరు హాజరుకాకపోటం మీ ఆధ్యాత్మిక సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, సత్యాన్ని విశ్వసించే వారితో కలిసి మెలసి ఉండటం ద్వారా పొందిఉండే ఆధ్యాత్మిక శక్తిని మీరు కోల్పోతారు. టెస్టిమొనీస్, సం. 4, పు. 115. ChSTel 229.3
విశ్వసించని సమాజంలో దైవ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ, ఓ కుటుంబం యేసుకి ప్రతినిధులుగా నివసించటం చిన్న విషయం కాదు. మనం మనుషులందరూ తెలుసుకుని చదువుతున్న ప్రతికలమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ స్థానంతో భయంకర బాధ్యతలు ముడిపడి ఉన్నాయి. వెలుగులో నివసించటానికి మీరు వెలుగు ప్రకాశించే స్థలానికి రావాలి. సోదరుడు కె ఎంతటి త్యాగమైనా చేసి కుటుంబ సమేతంగా ఈ సమావేశానికి హాజరవ్వాలి. కనీసం సత్యాన్ని ప్రేమించే వారి సాంవత్సరిక సమావేశానికి హాజరవ్వటం ఓ గంభీర విధిగా భావించాలి. అది అతణ్ని వారిని బలపర్చి వారిని కష్టాలు ఎదుర్కోటానికి, విధిని నిర్వహించటానికి సమర్ధుల్ని చేస్తుంది. సాటి విశ్వాసుల సహవాసాధిక్యతను పోగొట్టుకోటం వారికి మంచిదికాదు. ఎందుకంటే వారి మనసుల్లో సత్యం దాని ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది. దాని పరిశుద్ద ప్రభావం వారి హృదయాల్ని ఉత్తేజపర్చదు, రంజింపజెయ్యదు. వారు ఆధ్యాత్మికతను కోల్పోతారు. సజీవ బోధకు మాటలు వారిని బలపర్చవు. లౌకికమైన ఆలోచనలు, లౌకికమైన లావాదేవాలు నిత్యం వారి మనసుల్ని నింపి ఆధ్యాత్మికాంశాలకు తావు లేకుండా చేస్తాయి. టెస్టిమొనీస్, సం. 4, పు. 106. ChSTel 230.1
హాజరు కాగలిగిన వారందరు ఈ సాంవత్సరిక సమావేశాలకు హాజరు కావాలి. ఇది తమకు దేవుడు విధిస్తున్న కార్యమని అందరూ భావించాలి. తాము తనలోను తన కృప తాలూకు శక్తి విషయంలోను బలోపేతులయ్యేందుకు ఆయన ఇచ్చే ఆధిక్యతల్ని వినియోగించుకోకపోతే వారు నానాటికి బలహీనులై సర్వాన్నీ దేవునికి సమర్పించాలన్న కోరికను క్రమక్రమంగా కోల్పోతారు. ChSTel 230.2
సోదర సోదరీలారా, యేసుని కనుక్కోటానికి ఈ పరిశుద్ద సమావేశాలకు రండి. ఆయన విందుకి వస్తాడు. ఆయన హాజరవుతాడు. మీకు అత్యవసరంగా ఏమి చెయ్యటం అవసరమో అది ఆయన మీకు చేస్తాడు. మీ ఆత్మ ఉన్నతాసక్తుల కన్నా మా పొలాలు ఎక్కువ విలువైనవిగా పరిగణించవద్దు. మీకున్న భాగ్యం ఎంత విస్తారమైనది ఎంత విలువైంది అయినా అదంతా సమాధానాన్ని నిరీక్షణను కొనగలిగినంత గొప్పది కాదు. సమాధానం నిరీక్షణ వెల మీకున్నదంతా జీవితకాలమంతా మీరు చేసిన శ్రమ అంతా, మీరు పడ్డ బాధలన్నీ అయినా అది మీకు అపారమైన లాభం. నిత్య జీవానికి సంబంధించిన విషయాల్ని గూర్చి బలమైన స్పష్టమైన స్పృహ, క్రీస్తుకి సమర్పించుకోటానికి సమ్మతంగా ఉన్న హృదయం ఇవి గొప్ప దీవెనలు. ఇవి లోకంలోని సిరి సంపదలన్నిటి కన్నా వినోదాలు వైభవాలన్నింటి కన్నా ఎక్కువ విలువగలవి. టెస్టిమొనీస్, సం. 2, పు. 575, 576. ChSTel 230.3