Go to full page →

బైబిలు కాలంలోని ధనవంతులు ChSTel 239

ఈ ఇతియోపియా దేశస్తుడు మంచి సాంఘిక ప్రతిపత్తి పలుకుబడి గలిగిన వ్యక్తి. మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించినప్పుడు, తానుపొందిన వెలుగుని అతడు ఇతరులికి అందిస్తాడని, సువార్త పక్ష్యంగా బలీయమైన ప్రభావం చూపుతాడని దేవుడు గ్రహించాడు. వెలుగును అన్వేషిస్తున్న ఇతడితో దేవదూతలున్నారు. అతడు రక్షకునికి ఆకర్షితుడవుతున్నాడు. పరిశుద్దాత్మ పరిచర్య ద్వారా ప్రభువు అతణ్ని వెలుగుకి నడిపించగల ఓ వ్యక్తితో కలిపాడు. ది ఎక్టిస్ ఆఫ్ ది అపాజల్స్, పు. 107. ChSTel 239.2

శిశువు దశలో ఉన్న సంఘాన్ని నాశనం చెయ్యటానికి యూదులు ప్రయత్నిస్తున్నప్పుడు, దాన్ని కాపాడటానికి నికోదేము ముందుకి వచ్చాడు. ఆచి తూచి వ్యవహరించటం, ప్రశ్నించటం మానేసి శిష్యుల్ని తమ విశ్వాసంలో బలపర్చాడు. యెరూషలేములో ఉన్న సంఘాన్ని పోషించటానికి, సువార్త సేవ ప్రగతికి సహాయం చెయ్యటానికి తన భాగ్యాన్ని వినియోగించాడు. ఇంతకు ముందు రోజుల్లో అతణ్ని గౌరవించిన వారు ఇప్పుడు ద్వేషించి శ్రమలు పెట్టారు. లోక సంబంధమైన విషయాలపరంగా అతడు బీదవాడయ్యాడు. అయినా తన విశ్వాసాన్ని కాపడుకునే విషయంలో అతడు తడబడలేదు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 105. ChSTel 239.3