తమ పొలాలికి లేదా తమ వ్యాపారానికి ఎక్కువ సమయం పెట్టాలన్న ఉద్దేశంతో, ఐహిక ఐశ్వర్యం పరంగా తమకు నష్టం వస్తుందన్న భయంతో కొందరు ప్రార్ధన చెయ్యటం, దేవుని ఆరాధనకు సమావేశమవ్వటం నిర్లక్ష్యం చేస్తారు. తాము ఏ లోకానికి ఎక్కువ విలువనిస్తున్నారో తమ క్రియల ద్వారా వారు చూపిస్తున్నారు. తమ ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైన విషయాల్ని ఈ జీవితానికి సంబంధించిన విషయాల నిమిత్తం త్యాగంచేసి, వారు దైవ చిత్రాన్ని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించరు. క్రైస్తవ ప్రవర్తనను పరిపూర్ణం చేసుకోటంలో కొరవడి దేవుని కొలతలకి సరిపోరు. వారు భౌతికమైన ప్రాపంచికమైన ఆసక్తుల్ని ముందు పెట్టి, తన సేవకు ఇవ్వవలసిన సమయం విషయంలో దేవున్ని దోచుకుంటారు. అలాంటివారిని దేవుడు గుర్తిస్తాడు. వారు దీవెనలు కాదు శాపాలు పొందుతారు. టెస్టిమొనీస్, సం. 2, పు. 654. ChSTel 249.2