ఈ దేశంలో సేవ జరగని విశాల రంగమున్నది. వేల సంఖ్యలో ఉన్న నల్ల జాతి ప్రజలు క్రీస్తుని విశ్వసించే వారందరి పరిగణను సానుభూతిని ఆకర్షిస్తున్నారు. ఈ ప్రజలు విదేశంలో నివసించటంలేదు. రాతి విగ్రహాలకి కర్ర విగ్రహాలకి మొక్కటంలేదు. వారు మన మధ్య నివసిస్తున్నారు. తన ఆత్మ సాక్ష్యాల ద్వారా వారు నిర్లక్ష్యం చెయబడుతున్న మానవులంటూ ప్రభువు మన గమనాన్ని పదే పదే వారి మీదికి ఆహ్వానిస్తూ వస్తున్నాడు. సేవ జరగని ఈ విశాల రంగం మన ముందున్నది. దేవుడు మనకు ట్రస్టుగా ఇచ్చిన వెలుగును వారు ఆశిస్తూ యాచిస్తున్నారు. టెస్టిమొనీస్, సం. 8, పు. 205. ChSTel 254.1
తెల్లవారు నల్లవారి మధ్య వేర్పాటు గోడలు నిర్మితమయ్యాయి. తమ ప్రభువుని సర్వోన్నతంగాను తమ పొరుగు వారిని నిష్టాక్షంగాను ప్రేమించాలని చెబుతున్న దైవ వాక్యాన్ని క్రైస్తవులు ఆచరించినప్పుడు ఈ దురభిమాన గోడలు యెరికోగోడాల్ల కూలిపోతాయి. ఈ కాలానికి దేవుని సత్యాన్ని విశ్వసిస్తున్నామని చెప్పే సభ్యులు గల ప్రతీ సంఘం బానిసత్వ ఫలితంగా స్వతంత్రంగా తలంచటానికి, వ్యవహరించటానికి నోచుకోని, నిర్లక్ష్యానికి గురి అయిన ఈ పీడిత ప్రజల్ని పరిగణించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, డిసె. 17, 1895. ChSTel 254.2
దక్షినాది ప్రజల ఉద్దరణకు సేవ చెయ్యటానికి పూనుకుందాం. కేవలం నిలబడి చూడటంతోను కార్యచరణకు నోచుకోని తీర్మానాలు చెయ్యటంతోను మనం తృప్తి చెందకూడదు. కాని మన నల్లజాతి సహోదరుల శ్రమల్ని తగ్గించటానికి పాటుపడటం ద్వారా ప్రభువుకి హృదయపూర్వకంగా కొంత సేవ చేద్దాం. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర. 4, 1896. ChSTel 254.3
జీవ గ్రంథంలో నల్ల వ్యక్తి పేరు తెల్లవ్యక్తి పేరు పక్క రాయబడుతుంది. క్రీస్తులో అందరూ ఒకటే. పుట్టుక, స్థానం, జాతీయత లేక రంగు మనుషుల స్థాయి పెంచలేవు తగ్గించలేవు. మనిషికి విలువనిచ్చేది ప్రవర్తన. ఓ తెల్ల మనిషి, చైనా దేశపు మనిషి లేక ఆఫ్రికా దేశపు మనిషి తన హృదయాన్ని దేవునికిచ్చి విధేయత విశ్వాసం కలిగి ఉంటే అతడి రంగు ఏదైనా యేసు అతణ్ని ప్రేమిస్తాడు. అతణ్ని మిక్కిలి ప్రియమైన సహోదరుడా అని పిలుస్తాడు. ది సదర్న్ వర్క్, పు. 8, మార్చి 20, 1891. సువార్త నిరీక్షణ పై బలంగా ఆనుకున్న అతి సామాన్య ఆఫ్రికా దేశీయుడితో స్థలం మార్చుకోటానికి రాజులు మానవ ప్రభువులు తహతహలాడే దినం వస్తున్నది. సదర్న్ వర్క్, పు. 8, మార్చి 20, 1891. ChSTel 254.4
ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించి సంరక్షించాడో, తనకు సేవ చేసేందుకు రక్షించబడ్డ ఆఫ్రికా జాతీయుల్ని ప్రభువు అంతకన్నా తక్కువగా ప్రేమించి సంరక్షించడు. ఎక్కువ ఆధిక్యతలు అనుభవిస్తున్న వారికోసం పని చెయ్యటానికన్నా నల్లజాతి ప్రజలకోసం పనిచెయ్యటానికి మనపై మరింత బాధ్యతలేదా? ఈ ప్రజల్ని దాస్యంలో ఉంచిందెవరు? వారిని అజ్ఞానంలో ఉంచిందెవరు?... వారు భ్రష్ట స్థితిలో ఉంటే, వారి అలవాట్లు మట్టు మర్యాదలు హేయంగా ఉంటే, వారిని అలా ఎవరు తయారు చేశారు? తెల్లవారి వద్దనుంచి వారికి రావలసింది ఎంతోలేదా? వారికి ఎంతో హాని జరిగిన మీదట వారిని పైకి లేపటానికి యధార్థ కృషి జరగవద్దా? వారికి సత్యం అందించాలి. రక్షించబడటానికి మనలాంటి ఆత్మలే వారికి ఉన్నాయి. ది సదర్న్ వర్క్, పులు. 11,12, మార్చి 20, 1891. ChSTel 255.1