పెద్ద పెద్ద సమాజాల్లో సత్య ప్రకటన ఫలితంగా పరిశోధనా స్వభావం మేల్కొంటుంది. ఈ ఆసక్తిని ప్రోది చెయ్యటానికి వ్యక్తిగత అనుబంధ సేవ అవసరం. సత్యాన్ని పరిశోధించాలన్న ఆసక్తిగల వారికి దైవ వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చెయ్యటం నేర్పించాలి. నిశ్చితమైన పునాది పై నిర్మించటానికి వారికి ఎవరో ఒకరు నేర్పించాలి. తమ మతానుభవంలో జ్ఞాన వివేకాలు గల బైబిలు పనివారు వారికి సహాయం చేసి దైవవాక్య ధనాగారాన్ని తెరవటం ఎంత ప్రాముఖ్యం! టెస్టిమొనీస్, సం.9, పు.111. ChSTel 256.3
బంగారు తరుణం దాటిపోతుంది. ఏర్పడ్డ సదభిప్రాయాల్ని ప్రోదిచెయ్యటానికి అనుబంధసేవ జరగలేదు. అసలు ఆసక్తి పుట్టించకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒకసారి ఏర్పడ్డ నమ్మకాల్ని ప్రతిఘటించి జయించటం జరిగితే మనసును మళ్లీ సత్యంతో ప్రభావితం చెయ్యటం కష్టం. టెస్టిమొనీస్, సం.2, పు.118. ChSTel 257.1