నిరాసక్తత, అసమర్ధత భక్తికాదు. దేవుని పనిచేస్తున్నామన్న గుర్తింపు ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక సేవ పవిత్రతను గూర్చి మనకు మున్నెన్నటి కన్నా ఉన్నతమైన స్పృహ ఉంటుంది. ఈ గుర్తింపు మనం నిర్వర్తించే ప్రతీ విధిని చురుకుగా, అప్రమత్తంగా, శ్రద్ధగా చెయ్యటానికి నడిపిస్తుంది. టెస్టిమొనీస్, సం.9, పు. 150. ChSTel 261.1
ఈ సమయం అధిక సమర్థతను, అంకిత భావాన్ని కోరుతుంది. ఇది నా గుండెల నిండా ఉన్న అంశం అవ్వటంతో దేవునికి ఇలా మొర పెట్టుకుంటున్నాను. “తమ బాధ్యతలు గుర్తించిన సువార్త దూతల్ని సమస్త పాపానికి పునాది అయిన ఆత్మ విగ్రహారధన ఎవరి హృదయాల్లో లేదోఆ సువార్త దూతల్ని లేపు దేవా.” టెస్టిమొనీస్, సం.9, పు. 27. ChSTel 261.2
శిష్యులికి అప్పగించబడ్డ సేవకు గొప్ప సమర్థత అవసరమయ్యింది. ఎందుచేతనంటే చెడుతనం వారికి వ్యతిరేకంగా వరదలా లోతుగా, బలీయంగా లేచింది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 31. ChSTel 261.3