ఓ జనంగా మనకు మానసిక సంస్కృతి అవసరం. నేటి డిమాండ్లను ఎదుర్కోటానికి అది మనకు అవసరం. టెస్టిమొనీస్, సం.4, పు. 414. ChSTel 262.5
మనం దేవుని సేవలో ఆకస్మికంగా ప్రవేశించి జయం కోసం ఎదురు చూడగూడదు. మానసిక శక్తి కలవారు ఆలోచన పరులు ప్రభువుకి అవసరం. యేసు తోటి పని వారిని పిలుస్తున్నాడు, తప్పులు చేసే వారిని కాదు. ఆత్మల రక్షణకు అవసరమైన గొప్ప సేవ చెయ్యటానికి దేవుడు సరిగా ఆలోచించే మనుషుల్ని జ్ఞాన వివేకాలు గల మనుషుల్ని కోరుకుంటున్నాడు. టెస్టిమొనీస్, సం., పు. 67. ChSTel 263.1
వ్యాయామం ద్వారా మనసును క్రమ శిక్షణలో పెట్టడం కొందరి విషయంలో అవసరం. తలంచటానికి వారు మనసుని ఒత్తిడి చెయ్యాలి. తమ కోసం తలంచటానికి తమ సమస్యలు పరిష్కరించటానికి ఇంకొకరిపై ఆధారపడి, వారు తలంచే పనిని తమ మనసుకి నియమించటానికి నిరాకరిస్తుండగా జ్ఞాపకముంచుకోటానికి, ముందుకు చూసి అంతరం తెలుసుకోటానికి ఆశక్తత కొనసాగుతుంది. ప్రతీ వ్యక్తి తన మనసుకి శిక్షణ నివ్వటానికి కృషిచెయ్యాలి. టెస్టిమొనీస్, సం.2, పు. 188. ChSTel 263.2
మనం సోమరి, క్రమశిక్షణ లేని మనసుతోను, మందకొడి తలంపులు, బలహీన జ్ఞాపకాలతోను, తృప్తిపడాలని దేవుడు కోరటం లేదు. కౌనిసిల్స్ టు పేరెంట్స్, టీచర్చ్ అండ్ స్టూడెంట్స్, పు. 506. ChSTel 263.3
దేవుని మనుషులు శ్రద్దగా అధ్యయనం చెయ్యాలి. జ్ఞానం సంపాదించటంలో శ్రద్ధ వహించాలి. ఒక గంట సయితం వృధాపుచ్చకూడదు. ఎడతెగని శ్రమ ద్వారా క్రైస్తవులుగా, శక్తి ప్రభావాలు గల మనుషులుగా ఖ్యాతిలో వారు ఉన్నత శిఖరాలు చేరవచ్చు. టెస్టిమొనీస్, సం.4, పు. 411. ChSTel 263.4
గడియల్ని భద్రపర్చుకోండి. ప్రయాణంలో గడి పే సమయం.. భోజనానికి వేచి ఉండే గడియలు, సమయానికి రాని వారి కోసం నిరీక్షించే సమయం - ఓ పుస్తకం దగ్గర ఉంచుకుని, ఈ నిముషాల్ని పఠనంలోనో లేక ఆలోచించటంలోనో సద్వినియోగపర్చుకుంటే ఏది సాధించలేము? క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 343, 344. ChSTel 263.5
దృఢమైన లక్ష్యం, ఎడతెగని పరిశ్రమ, సమయాన్ని జాగ్రత్తగా వినియోగించటం - ఇవి ప్రభావం ప్రయోజనం గల ఏ స్థానానికైనా అరుల్నిచెయ్యగల జ్ఞానాన్ని, మానసిక క్రమశిక్షణను సంపాదించటానికి మనుషులకి తోడ్పడ్డాయి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 334. ChSTel 264.1
బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు నిత్యం వృద్ధి పొందుతూ ఉండాలి. పాత అనుభవం మీద ఆనుకుని శాస్త్రీయ జ్ఞానం గల పనివారం కానవసరం లేదని వారు భావించకూడదు. లోకంలోకి జన్మించినప్పుడు మానవుడు దేవుడు సృజించిన ప్రాణులందరిలోను మిక్కిలి అసహాయుడు, మిక్కలి వక్ర స్వభావి అయినా నిత్యం పురోగమించే సామర్థ్యమున్నవాడు. అతడు శాస్త్రం వలన జ్ఞానం పొందవచ్చు. సద్గుణం వలన సౌమ్యుడు కావచ్చు. జ్ఞానంలో పరిపూర్ణతను, ప్రవర్తనలో పవిత్రతను - కాని దూతల కన్నా కొంచెం తక్కువ సంపూర్ణత, తక్కువ పవిత్రత - సంపాదించే వరకు అతడు మానసిక, నైతిక గౌరవంలో వృద్ధి చెందుతూ ఉండవచ్చు. టెస్టిమొనీస్, సం.4, పు. 93. ChSTel 264.2
దేవుని జతపనివారు కావాలని ఆశించేవారు శరీరంలోని ప్రతీ అవయవ సంపూర్ణత మానసిక నాణ్యత సాధనకు కృషి చెయ్యాలి. ప్రతీ విధిని నిర్వహించటానికి శారీరక, మానసిక, నైతిక శక్తుల్ని సిద్ధం చేసేది, శరీరాన్ని మనసును ఆత్మను దేవుని సేవకు తర్బీతు చేసేదే యధార్థ విద్య. ఇదే నిత్యజీవం వరకు సాగే విద్య. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 330. ChSTel 264.3
తమ పనిలోను వ్యాపారంలోను నిపుణులయ్యేందుకు మెకానిక్కులు, న్యాయవాదులు, వర్తకులు అన్ని వ్యాపారాలు వృత్తి పనులు చేసేవారు తమను తాము తర్బీతు చేసుకుంటారు. క్రీస్తు అనుచరులు తక్కువ తెలివి తక్కువ జ్ఞానం కలవారై ఉండాలా? ఆయన సేవలో ఉన్నామని చెప్పుకుంటూ ఆ సేవలో తాము ఉపయోగించాల్సిన మార్గాలు సాధనాల విషయంలో అజ్ఞానులై ఉండాలా? నిత్యజీవం పొందటానికి పాటుపడటం లౌకిక వ్యాపారాలన్నిటికన్నా ప్రధానమైంది. ఆత్మల్ని యేసు వద్దకు నడిపించటానికి మానవ నైజాన్ని గూర్చిన జ్ఞానం, మానవ మనసు తాలూకు అధ్యయనం అవసరం. సత్యం అన్నగొప్ప అంశం పై పురుషులు స్త్రీలతో ఎలా మాట్లాడోనేర్చుకోటానికి ఎంతో ఆలోచన, మనఃపూర్వక ప్రార్ధన అవసరం. టెస్టిమొనీస్, సం.4, పు. 67. ChSTel 264.4