శిష్యులు చేసిన పనినే మనం కూడా చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు ఓ మిషనరీ కావాలి. సహాయం అవసరమైనవారికి సానుభూతితో, కరుణ కటాక్షాలతో సేవచెయ్యాలి. మానవుల దుఃఖాలు బాధలు తేలిక చెయ్యటానికి నిస్వార్ధంగా ప్రయత్నించాలి. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 27. ChSTel 19.4
ఆది శుష్యులకి ఆయన ఇచ్చిన ట్రస్టులో ప్రతీ యుగంలోని విశ్వాసులు పాలుపంచుకుంటున్నారు. సువార్తను విశ్వసించే ప్రతి వ్యక్తీ లోకానికి అందిచేందుకు పవిత్ర సత్యాన్ని అందుకుంటాడు. దేవుని నమ్మకమైన ప్రజలు ఎల్లప్పుడు భయమెరుగని మిషనరీలుగా పనిచేస్తారు. తమ వనరుల్ని ఆయన నామ గనతకు సమర్పిస్తారు. తమ ప్రతిభాసామర్థ్యాల్ని ఆయన సేవలో వినియోగిస్తారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది ఆపాజల్స్, పు. 109. ChSTel 19.5
సువార్తాదేశం క్రీస్తు రాజ్య మిషనెరీ శాసన పత్రం. శిష్యులు ఆత్మల కోసం పట్టుదలగా పనిచెయ్యాల్సి ఉంది. అందరికీ ఆహ్వానం అందించాల్సి ఉంది. ప్రజలు తమ వద్దకు రావాలని వారు కని పెట్టకూడదు. తమ వర్తమానంతో వారే ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 28. ChSTel 20.1
క్రీస్తులోకంలో ఉన్నప్పుడు చేసిన సేవనే దైవ సేవకులు చెయ్యాల్సి ఉంది. ఆయన నిర్వర్తించిన ప్రతీ పరిచర్యశాఖ పై వారు శ్రద్ధ పెట్టాల్సి ఉంది. శోధింప శక్యంకాని ఐశ్వర్యం గురించి, పరలోక అమర్త్య భాగ్యం గురించి వారు ప్రజలకు చిత్తశుద్ధితో బోధించాల్సి ఉంది. టెస్టిమొనీస్, సం.9, పు. 130. ChSTel 20.2
శిష్యులకిచ్చిన ఆదేశాన్నే ప్రభువు మనకూ ఇస్తున్నాడు. దేవుడు లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్న ప్రజల ముందు సిలువను పొంది తిరిగివేచిన రక్షకుణ్ని పైకెత్తినట్లే నేడు కూడా పైకెత్తాల్సి ఉంది. ప్రభువు పాదుర్లకు ఉపాధ్యాయులుకు సువార్తికులకు పిలుపు నిస్తున్నాడు. ఆయన సేవకులు ప్రతీ గృహానికి రక్షణ వర్తమానాన్ని కట్టించాలి. క్రీస్తు ద్వారా క్షమాపణ అన్న వార్తను ప్రతీ జాతికి, ప్రతీ ప్రజకు ప్రతీ భాష మాట్లాడేవారికి అందించాలి. ఈ వర్తమానాన్ని నిర్జీవమైన నిరాసక్తమైన మాటలతోగాక స్పష్టమైన, నిర్ణయాత్మకమైన, ఉద్వేగభరితమైన మాటలతో సమర్పించాలి. మరణం నుంచి తప్పించుకోటానికి హెచ్చరిక కోసం వందలాది ప్రజలు కని పెడుతున్నారు. క్రైస్తవంలోని శక్తికి నిదర్శనాన్ని ప్రపంచం చూడటం అవసరం. కేవలం కొన్ని స్థలాల్లోనే కాదు లోకమంతటా కృపావర్తమానాలు అవసరం. గాసిపుల్ వర్కర్స్, పు. 29. ChSTel 20.3
పరలోకానికి ఆరోహణమైనప్పుడు యేసు సువార్త వెలుగు పొందినవారికి తన పనిని అప్పగించాడు. ఆ పనిని వారు కొనసాగించి ముగించాల్సి ఉంది. సత్యాన్ని ప్రకటించటానికి మరే ఇతర సాదనాన్నీ ఆయన ఏర్పాటు చెయ్యలేదు. “మీరు సర్వలోకమునకు వెల్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి.” “ఇదిగో నేను యుగ సమాప్తివరకు సదాకాలము మితో కూడ ఉన్నాను.” గంభీరమైన ఈ ఆదేశం ఈ యుగంలోని మనకూ వస్తున్నది. దాన్ని అంగీకరించే లేదా విసర్జించే బాధ్యతను ఆయన తన సంఘానికి విడిచి పెడ్తున్నాడు. హిస్టారికల్ స్కెచ్చేస్, పు. 288. ChSTel 20.4
మన మీద ఓ పవిత్ర బాధ్యత మోపబడింది. “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్దాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అన్న ఆదేశాన్ని ఆచరించాల్సిన బాధ్యత. మత్తయి 28:19,2. రక్షణ సువార్తను ప్రకటించే సేవకు మీరు అంకితమయ్యారు. పరలోక పరిపూర్ణత్వం మీ శక్తికావాలి. టెస్టిమొనీస్, సం.9, పులు. 20.21. ChSTel 21.1