Go to full page →

సాహసవంతులు, యధార్ధవంతులు ChSTel 287

అపాయకరమైన ఈ చివరి దినాల్లో సంఘానికి అవసరమయ్యింది పౌలులా ప్రయోజకులుగా తమను తాము తర్బీతు చేసుకున్న, దైవ విషయాల్లో లోతైన అనుభవం గడించిన, చిత్త శుద్ధి ఉత్సాహం గల పనివారి సైన్యం. పరిశుద్దులు, ఆత్మత్యాగ స్పూర్తి గల మనుషులు; శ్రమను బాధ్యతను తప్పించుకోని మనుషులు; సాహసం యధార్థత గల మనుషులు; ఎవరి హృదయాల్లో క్రీస్తు “మహిమా నిరీక్షణ” గా ఏర్పడతాడో ఆ మనుషులు; ఎవరి పెదవులు అగ్నిని స్పృశించగా వారు “వాక్యం ప్రకటిస్తారో” ఆ మనుషులు అవసరం. అట్టి పనివారు లేనందువల్ల దేవుని సేవ క్షీణిస్తున్నది. ప్రాణాంతకమైన విషంలా ఘోర తప్పిదాలు మనుషుల నైతికతని మలినపర్చి మానవ జాతి నిరీక్షణల్ని భగ్నం చేస్తున్నాయి. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 507. ChSTel 287.1

వ్యతిరేకత, ప్రమాదం, నష్టం, మానవ బాధ నడుమ తీవ్ర పోరాటం ద్వారా ఆత్మల రక్షణ సేవ పురోగమించాల్సి ఉంది. ఓ యుద్దంలో దాడి సల్పుతున్న సేనలోని ఓ రెజిమెంటుని శత్రు సేనలు తిప్పికొడుతున్నప్పుడు, సైనికులు వెనక్కి మళ్లుతుంటే, పతాక వాహకుడు తన స్థానంలోనే నిలిచి ఉన్నాడు. “పతాకం వెనక్కి తీసుకు రా” అంటూ కెప్టెను ఇచ్చిన ఆదేశానికి “పతాకం వద్దకి సైనికుల్ని తీసుకురండి” అని బదులు పలికాడు. ధ్వజం మోసే ప్రతీ వ్యక్తి మీద ఉన్న బాధ్యత ఇదే - మనుషుల్ని పతాకం వద్దకు తీసు కు వెళ్లటం అనే కులు చేస్తున్న పాపం తాము తమ కు సంబంధించినవారు పతాకానికి దీటుగా రాలేకపోవటం. టెస్టిమొనీస్, సం. 9, పులు. 45, 46. ChSTel 287.2

అపాయకర సమయంలో అందరి శక్తి, ఉత్సాహం, ప్రభావం అవసరమైనప్పుడు భయపడకుండా న్యాయానికి నిలబడలేని మనుషుల్ని దేవుడు ఉపయోగించలేడు. తప్పుకు వ్యతిరేకంగా పోరాటం సల్పటానికి, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాధులతోను, ఉన్నత స్థలాల్లో ఉన్న దుర్మార్గతతోను పోరాడటానికి, పురుషుల్ని స్త్రీలని ఆయన పిలుస్తున్నాడు. ఇలాంటి మనుషుల్ని “భళా నమ్మకమైన మంచి దాసుడా” అని దేవుడు సంబోధిస్తాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 142. ChSTel 287.3

ఏలీయా, నాతాను, బాప్తిస్మమిచ్చే యోహాను వంటి మనుషుల్ని, పర్యవసానాల్ని లెక్కజెయ్యకుండా తానిచ్చిన వర్తమానాన్ని నమ్మకంగా అందించే మనుషుల్ని; తమకున్నదంతా త్యాగం చెయ్యాల్సిందిగా అది కోరుతున్నప్పటికీ సత్యాన్ని ధైర్యంగా మాట్లాడే మనుషుల్ని దేవుడు పిలుస్తున్నాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 142. ChSTel 288.1