పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తొలినాటి శిష్యులికి చెందినట్లే నేడు మనకూ చెందుతుంది. పెంతెకోస్తు దినాన రక్షణ వార్త విన్నవారికిచ్చినట్లే నేడు పురుషులుకి స్త్రీలకి దేవుడు పరిశుద్దాత్మ వరాన్ని ఇస్తాడు. ఈ గడియలో ఆయన ఆత్మ, ఆయన కృప ఎవరికి అవసరమో, ఆయన మాటను ఎవరు విశ్వసిస్తారో వారందరి కోసం అవి ఉన్నాయి. టెస్టిమొనీస్, సం.8, పు. 20. ChSTel 294.1
పరిశుద్దాత్మను గూర్చిన వాగ్దానం ఓ శకానికి గాని ఓ జాతికిగాని పరిమితం కాదు. తన ఆత్మ దైవిక ప్రభావం తన అనుచరులతో చివరి వరకు ఉంటుందని క్రీస్తు చెప్పాడు. పెంతెకొస్తు నాటినుంచి ప్రస్తుత కాలం వరకు ప్రభువుకి ఆయన సేవకు ఎవరు సంపూర్తిగా తమను అంకితం చేసుకున్నారో వారందరికి పరిశుద్దాత్మ అనుగ్రహించబడ్డాడు, అనుగ్రహించబడుతున్నాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 40. ChSTel 294.2
తన ప్రజల్ని పరిశుద్ధాత్మ వరంతో తాజాపర్చి తన ప్రేమలో వారికి నూతనంగా బాప్తిస్మమివ్వాలని దేవుడు అభిలషిస్తున్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ కొరత ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఆరోహణం అనంతరం వేచి ఉన్న ప్రార్ధిస్తున్న, విశ్వసిస్తున్న శిష్యుల మీదికి ప్రతీ హృదయాన్ని చేరగలిగినంత సంపూర్ణతతో శక్తితో పరిశుద్ధ పర్చాడు. భవిష్యత్తులో భూమండలం దేవుని మహిమతో వెలిగిపోతుంది. సత్యం ద్వారా పరిశుద్దులైన వారి నుంచి ఓ దివ్య ప్రభావం బయలుదేరి లోకంలోకి వెళ్తుంది. భూమిని కృపా వాతావరణం ఆవరించనుంది. పరిశుద్ధాత్మ దేవుని సంగతుల్ని తీసుకుని మనుషులకు చూపిస్తూ మానవ హృదయాల్లో పని చేస్తాడు. సదర్న్ వాచ్ మేన్, సెప్టె. 5, 1905. ChSTel 294.3
చివరి కాలంలో లోకంలో దేవుని సేవ ముగిసేటప్పుడు, పరిశుద్దాత్మ దర్శకత్వంలో ప్రతిష్ఠితులైన విశ్వాసులు చేసే సేవ దేవుని ప్రత్యేక కృపా సూచనలతో సమాప్తమవ్వటం వాస్తవం. తూర్పు దేశాల్లో విత్తనాలు చల్లే సమయంలోను, పంట పండే సమయంలోను పడే తొలకరి కడవరి వర్గాల సంకేతం కింద దేవుని సంఘంపై ఆధ్యాత్మిక కృప అసామాన్య పరిమాణంలో పడుతుందని హెబ్రీ ప్రవక్తలు ప్రవచించారు. అపొస్తలుల కాలంలో జరిగిన ఆత్మ కుమ్మరింపు తొలకరి వాన ప్రారంభం. దాని ఫలితం మహిమాన్వితం. లోకం చివరి గడియ వరకూ యధార్థ సంఘంతో ఆత్మ ఉంటాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 54, 55. అపొస్తలుల కాలంలోని ఆత్మకుమ్మరింపు “తొలకరి వాన,” దాని ఫలితం మహిమాన్వితం. అయితే కడవరి వాన ఇంకా విస్తారంగా ఉంటుంది. ఈ దినాల్లో నివసిస్తున్న వారికి ఉన్న వాగ్దానం ఏమిటి? “బంధకములలో పడియుండియు నిరీక్షణ లేని వారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసెదను.” “కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోను పైరు మొలుచనట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును.” టెస్లిమొనీస్, సం. 8, పు. 21. ChSTel 294.4