Go to full page →

జయానికి అత్యవసరం ChSTel 298

సత్య ప్రకటనకు లోక ప్రతిష్ఠ లేదా లోక మహిమ ఇవ్వలేని శక్తిని దైవ సేవకులతో దేవుని ఆత్మ సముఖం ఇస్తుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 51. ChSTel 298.2

మనముందున్న సేవను మన సొంత శక్తితో చెయ్యమని దేవుడు మనల్ని అడగటం లేదు. మానవ వనరులు పనికిరాని అత్యవసర పరిస్థితులన్నింటికీ ఆయన దైవ సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రతీ కష్టంలోను సహాయం చెయ్యటానికి, మన నిరీక్షణను, నిశ్చయతను బలపర్చటానికి, మన మనసుల్ని వెలిగించటానికి, మన హృదయాల్ని శుద్దీకరించటానికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. సదర్న్ వాచ్ మేన్, ఆగ. 1, 1905. ChSTel 298.3

పరిశుద్దాత్మ కుమ్మరింపు అనంతరం ఆయన (క్రీస్తు) పట్ల, ఆయన ఎవరి కోసం మరణించాడో ఆ ప్రజలపట్ల శిష్యులు ఎంత ప్రేమతో నిండారంటే వారు మాట్లాడిన మాటలకు, వారు చేసిన ప్రార్థనలకు హృదయాలు కరిగాయి. వారు పరిశుద్దాత్మ శక్తి మూలంగా మాట్లాడారు. ఆ శక్తి ప్రభావం కింద వేలమంది మారు మనసు పొంది. క్రైస్తవ్యాన్నంగీకరించారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 22. ChSTel 298.4

స్వార్థాన్ని పక్కన పెట్టి, తన హృదయంలో పరిశుద్దాత్మ పని చెయ్యటానికి చోటు పెట్టి, దేవునికి పూర్తిగా సమర్పితమైన జీవితం ఏ వ్యక్తి జీవిస్తాడో అతడి ప్రయోజకత్వానికి హద్దులుండవు. సదర్న్ వాచ్ మేన్, ఆగ. 1, 1905. ChSTel 299.1

పెంతెకొస్తు దినాన పరిశుద్దాత్మ కుమ్మరింపు ఫలితం ఏమిటి? రక్షకుడు తిరిగి లేచిన ఉల్లాస వార్త అప్పటి ప్రపంచం అన్నిచోట్లా ప్రకటించబడింది... వారి సేవ ఫలితంగా ఎన్నికైన మనుషులు సంఘంలో చేరారు. వారు జీవ వాక్యాన్ని అందుకున్న తర్వాత తమ హృదయాల్ని సమాధానంతోను, సంతోషంతోను నింపిన సత్యాన్ని ఇతరులుకి అందించటానికి తమ జీవితాల్ని సమర్పిచుకున్నారు. “దేవుని రాజ్యము సమీపమాయెను” అన్న వర్తమానాన్ని వందలాది ప్రజలు ప్రచురించారు. వారిని పరిమితం చెయ్యటంగాని బెదిరింపులతో భయ పెట్టటంగాని సాధ్యపడలేదు. ప్రభువు వారి ద్వారా మాట్లాడాడు. వారు ఎక్కడకు వెళ్లే అక్కడ వ్యాధిగ్రస్తులు స్వస్తత పొందారు. బీదలకు సువార్త ప్రకటించబడింది. మనుషులు తమను తాము పరిశుద్ధాత్మ నడుపుదల కు . సమర్పించుకున్నప్పుడు దేవుడు అంత అద్భుతంగా పని చేస్తాడు. సదర్న్ వాచ్ మేన్, ఆగ. 1, 1905. ChSTel 299.2

ఆత్మలో ఆధ్యాత్మిక జీవితానికి పరిశుద్దాత్మ ఊపిరి. ఆత్మను ఇవ్వటమంటే క్రీస్తు జీవితాన్నివ్వటం. గ్రహీతకు అది క్రీస్తు గుణలక్షణాల్ని దఖలు పర్చుతుంది. దేవునిచే ఇలా ఉపదేశించబడేవారు, ఎవరి హృదయాల్లో ఆత్మ పని చేస్తాడో వారు, ఎవరి జీవితంలో క్రీస్తు జీవితం ప్రదర్శితమౌతుందో వారు మాత్రమే సంఘం తరపున పని చెయ్యటానికి ప్రతినిధులుగా నిలబడాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 805.. ChSTel 299.3

విచిత్రమైన వేగవంతమైన మార్పులు త్వరలో చోటు చేసుకోనున్నాయి. దైవ ప్రజలు పరిశుద్ధాత్మ వరం పొందవలసి ఉంది. పరలోక జ్ఞానంతో వారు ఈ యుగంలో ఏర్పడే అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కుని సాధ్యమైనంత వరకు నిరుత్సాహపర్చే ఐహిక ఉద్యమాల్ని ప్రతిఘటించాల్సి ఉన్నారు. సంఘం నిద్రించకుండా ఉంటే, క్రీస్తు అనుచరులు మెలకువగా ఉండి ప్రార్థిస్తే, శత్రువు కదలికల్ని గ్రహించి అప్రమత్తులవ్వటానికి వారికి వెలుగు లభించవచ్చు. టెస్టిమొనీస్, సం.6, పు. 436. ChSTel 299.4