దూతల పరిచర్య గురించి మనం ఇప్పటికన్నా మెరుగుగా అవగాహన చేసుకోటం అవసరం. దేవునికి నమ్మకమైన ప్రతీ బిడ్డకు పరలోక నివాసుల సహకారముంటుంది. దేవుని వాగ్దానాల్ని విశ్వసించి వాటి నెరవేర్పును కోరే సాత్వికులు దీనుల చుట్టూ వెలుగు శక్తిగల అదృశ్య సైన్యాలు మోహరించి ఉంటాయి. కెరూబులు, సెరాపులు, విస్తారమైన శక్తిగల దూతలు దేవుని కుడి పక్క నిలబడి ఉంటారు. వీరు “రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు.” ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 154. ChSTel 303.5
ప్రభువైన యేసు నిపుణ కార్మికుడని గుర్తుంచుకోవాలి. విత్తిన విత్తనానికి ఆయన నీళ్లు పోస్తాడు. హృదయాల్ని చేరే మాటల్ని ఆయన మీ మనసుల్లో పెడతాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 41. ChSTel 304.1
పటిష్ఠమైన విశ్వాసంతో క్రియా పరిపూర్ణత సాధించే పరిపూర్ణ ప్రవర్తనని అన్వేషించే మానవ ప్రతినిధితో పరలోక నివాసులు పనిచేస్తారు. ఈ సేవలో నిమగ్నులై ఉన్నవారితో క్రీస్తు మీకు సహాయం చెయ్యటానికి నేను మీ కుడి పక్కనే ఉన్నాను అంటున్నాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 332. ChSTel 304.2
నశించిపోతున్న ఆత్మల కోసం పని చెయ్యటంలో మీకు దేవదూతల సాహచర్యముంటుంది. క్రీస్తు రాకకోసం ఓ జనాంగం సిద్దపడేందుకు దేవుడు తమకు ఉదారంగా ఇచ్చిన వెలుగును ఇతరులికి అందించే మన సంఘ సభ్యులతో సహకరించటానికి వేలు, లక్షలు కోట్లాది దూతలు వేచి ఉన్నారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 129. ChSTel 304.3
పరలోకంలో ఉన్న దూతలందరు ఈ పనిలో సహకరించటానికి సిద్ధంగా ఉన్నారు. నశించిన వారిని రక్షించటానికి ప్రయత్నిస్తున్న వారి అదుపాజ్ఞలకింద పరలోక వనరులన్నీ ఉంచబడుతున్నాయి. మిక్కిలి నిరాసక్తంగా ఉన్న వారిని, మిక్కిలి కఠిన హృదయుల్ని చేరటానికి దూతలు మీకు సహాయం చేస్తారు. ఒక్క ఆత్మను తిరిగి తీసుకువచ్చినప్పుడు పరలోకంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సెరాపులు, కెరూబులు తమ బంగారు వీణలు మీటుతూ మానవుల పట్ల తమ కృపానురాగాలకు దేవునికి గొర్రెపిల్లకు స్తుతులర్పిస్తూ పాటలు పాడారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 197. ChSTel 304.4
గలిలయ జాలరుల్ని పిలిచిన ఆ ప్రభువు తన సేవ నిమిత్తం నేడు మనుషుల్ని పిలుస్తున్నాడు. తన తొలి శిష్యుల ద్వారా తన శక్తిని ప్రదర్శించినట్లే మన ద్వారాను ప్రదర్శించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనం ఎంత అసంపూర్ణులం, ఎంత పాపులం అయినా ప్రభువు తనతో భాగస్వామ్యాన్ని, క్రీస్తు కింద శిక్షణాధిక్యతను మనకు అర్పిస్తున్నాడు. క్రీస్తుతో ఏకమై దేవుని పనులు చేసేందుకు దైవోపదేశానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ది డిజైర్ ఆప్ ఏజెస్, పు. 297. ChSTel 304.5
పూర్తిగా తన కోసం నివసించే వారికి క్రీస్తు విలువ నిస్తాడని మీరు భావించరా? ప్రియుడైన యోహానులా కఠినమై, దుర్బరమైన స్థలాల్లో ఉన్న వారిని ఆయన దర్శిస్తాడని మీరనుకోరా? ఆయన తన భక్తుల్ని కనుగొని వారితో మాట్లాడాడు. వారిని ఉత్సాహపర్చి బలపర్చుతాడు. సత్యం తెలియని వారికి సత్యాన్ని బోధించే తన మానవ సేవకులకి పరిచర్య చెయ్యటానికి బలాధిక్యులైన దేవదూతల్ని పంపుతాడు. టెస్టిమొనీస్, సం. 8, పు. 17. ChSTel 305.1
పరలోకమంతా పనిలో ఉంటుంది. క్రీస్తు ఎవరికోసం మరణించాడో ఆ ప్రజలు రక్షణ సువార్త వినేటట్లు ప్రణాళికలు తయారు చేసుకుని వాటి ప్రకారం సేవ చేసే వారితో పరలోకమంతా సహకరించటానికి వేచి ఉన్నది. రక్షణకు వారసులైన వారికి పరిచర్య చేసే దూతలు ప్రతీ యధార్థ భక్తుడితో ఇలా అంటున్నారు, ” ‘మాకు పని ఉన్నది’ మీరు వెళ్లి... నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పు..” అ.కా. 5:19,20. ఈ ఆజ్ఞ ఎవరికి వస్తుందో వారు దాన్ని ఆచరిస్తే, దేవుడు వారి ముందు మార్గాన్ని సుగమం చేస్తాడు. ముందుకి వెళ్లటానికి ఆర్థిక వనరుల్ని వారి కనుగ్రహిస్తాడు. టెస్టిమొనీస్, సం.6, పులు. 433, 434. ChSTel 305.2
ఇటువంటి కాలంలో దేవుని ప్రతీ బిడ్డ ఇతరులకి సహాయం చెయ్యటంలో తల మునకలై ఉండాలి. బైబిలు సత్యాన్ని అవగాహన చేసుకున్నవారు వెలుగుకోసం ఆశతో ఎదురు చూస్తున్నవారికోసం వెతుకుతుండగా దేవదూతలు వారి పక్కనే ఉంటారు. దేవదూతలు ఎక్కడకు వెళ్తారో అక్కడకు వెళ్లటానికి ఎవరూ భయపడనవసరం లేదు. అంకిత భావంగల పనివారి నమ్మకమైన సేవ ఫలితంగా అనేకులు విగ్రహారాధనను విడిచి పెట్టి జీవం గల దేవుని ఆరాధించటం మొదలు పెత్తారు. అనేకులు మానవ కల్పిత అచారాలు వ్యవస్తల్ని గౌరవించటం మాని, దేవుని పక్క ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రం పక్క నిర్భయంగా నిలబడ్డారు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 171. ChSTel 305.3
నిరుత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో దేవుని సేవకులు సల్పుతున్న పోరాటాన్ని పరలోక అధికారాలు శక్తులు పరిశీలిస్తున్నాయి. క్రైస్తవులు తమ విమోచకుని ధ్వజం కింద సంఘటితమై విశ్వాస పోరాటాన్ని పోరాడటానికి ముందుకి సాగుతుండగా నూతన విజయాలు నూతన గౌరవాలు లభిస్తున్నాయి. దీనులైన, విశ్వాసం గల దైవ ప్రజలకు సేవ చెయ్యటానికి పరలోక దూతలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ లోకంలో దేవుని సైన్యం స్తుతిగానం చేసేటప్పుడు పరలోకంలోని గాన బృందం దేవునికి ఆయన కుమారునికి స్తుతి చెల్లించటంలో గళం కలుపుతారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 154. ChSTel 306.1
సేవను జయప్రదం చేసేది మనుషుల శక్తి కాదు. పరలోక నివాసులు మానవ ప్రతినిధులతో పని చెయ్యటం సేవను సంపూర్ణం చేస్తుంది. ఓ పౌలు నాటవచ్చు, ఓ అపొల్లో నీరు పొయ్యవచ్చు గాని వృద్ధినిచ్చేవాడు దేవుడే. సేవలో దేవుడు చెయ్యాల్సిన పనిని మానవుడు చెయ్యలేడు. మానవ ప్రతినిధిగా అతడు పరలో నివాసులతో సహకరించి, దేవుడు అత్యున్నత నిపుణతగల పనివాడని గుర్తించి, సామాన్యత, సాత్వికం కలిగి తన శక్తి మేరకు పని చెయ్యాలి. పనివారు మరణించి సమాధి అయినా పని ఆగదు. ముగిసే వరకు అది కొనసాగుతుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 14, 1893. ChSTel 306.2
క్రైస్తవుడికి ఎల్లప్పుడు క్రీస్తులో బలమైన సహాయకుడున్నాడు. ఆయన సహాయం చేసే మార్గం మనకు తెలియకపోవచ్చు. ఇది మాత్రం మనకు తెలుసు: ఎవరు తన పై నమ్మకముంచుతారో వారిని ఆయన ఆశాభంగపర్చడు. తమ విషయంలో విరోధి ఉద్దేశాలు నెరవేరకుండేందుకు తమ మార్గాన్ని ప్రభువు ఎన్నిసార్లు సుగమం చేశాడో క్రైస్తవులు గుర్తించగలిగితే, వారు మార్గంలో తడబడుతూ ఫిర్యాదులు చెయ్యరు. వారి విశ్వాసం దేవుని పై స్థిరంగా ఉంటుంది. వారిని కదల్చే శక్తి ఏ శ్రమకు ఉండదు. ఆయన్ని తమ వివేకంగాను సమర్ధతగాను వారు గుర్తిస్తారు. వారి ద్వారా ఏమి చెయ్యాలని ఆయన ఉద్దేశిస్తాడో అది జరిగేటట్లు ఆయన చేస్తాడు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 576. ChSTel 306.3
సువార్త పరిచర్యలో ఉన్నవారందరు దేవుని సహాయకులు. వారు దేవదూతల తోటి పనివారు. ఇంకా చెప్పాలంటే ఎవరి ద్వారా దేవదూతలు తమ నియుక్త కార్యాన్ని సాధిస్తారో వారు ఆ మానవ సాధనాలు. దేవదూతలు వారి స్వరాల ద్వారా మాట్లాడి వారి చేతుల ద్వారా పనిచేస్తారు. పరలోక ప్రతినిధులతో సహకరించే మానవ పనివారికి తమ విద్య తమ అనుభవం ఉపకరిస్తాయి. ఎడ్జుకేషన్, పు. 271. ChSTel 307.1
ప్రతీ పురుషుడు ప్రతి స్త్రీ తన నీతి కవచం ధరించి పని చెయ్యటం ప్రారంభించాల్సిందిగా క్రీస్తు పిలుపునిస్తున్నాడు. “మి కు సహాయమందించటానికి నేను మీ కుడి ప్కనే ఉన్నాను” అంటున్నాడు. మా కష్టాలు మీ ఆందోళనల్ని దేవునికి చెప్పండి. మీ రహస్యాల్ని ఆయనకు వెల్లడి చెయ్యండి. తాను కొన్న ఆస్తి అయిన సంఘం అంత విలువైంది. సత్య విత్తనాల్ని వెదజల్లటానికి బయలుదేరి వెళ్లే సేవకులంత విలువైంది. ఇంకేదీ లేదు.... క్రీస్తుని గురించి ఆలోచించండి. ఆయన తన పరిశుద్ద స్థలంలో ఉన్నాడు. ఏకాంతంలో లేడు. తన ఆజ్ఞను శిరసావహించటానికి సిద్ధంగా ఉన్న వేవేల దూతల నడుమ ఉన్నాడు. దేవునిపై విశ్వాసముంచిన మిక్కిలి బలహీన భక్తుడి కోసం పని చెయ్యాల్సిందని వారిని ఆదేశిస్తున్నాడు. ఘనులు, దీనులు, ధనికులు, దరిద్రులు అందరికీ ఒకే సహాయం ఏర్పాటు చెయ్యబడింది. సదర్న్ వాచ్ మేన్, నవ. 7, 1905. ChSTel 307.2