క్రమపద్దతిగా సంఘటితమై సుశిక్షితమైన యువత ప్రతిభ మన సంఘాల్లో అవసరం. పొంగిపొర్లే తమ శక్తులతో యువత ఏదో చేస్తుంటారు. ఈ శక్తుల్ని సరియైన మార్గాల్లోకి నడిపించకపోతే, తమ సొంత ఆధ్యాత్మికతకు హాని కలిగే మార్గంలో యువత వాటిని ఉపయోగించి, వారితో సహవాసం చేసేవారికి కీడు కలిగిస్తారు. గాస్పుల్ వర్కర్స్, పు. 211. ChSTel 28.4
యువత తమ హృదయాల్ని దేవునికి ఇవ్వటంతోనే మన బాధ్యత తీరిపోదు. వారు ప్రభువు సేవలో ఆసక్తి కనపర్చాలి. తన సేవ పురోగతికి కొంత సేవ చెయ్యాలని దేవుడు తమను కోరుతున్నాడని చూసేటట్లు వారిని నడిపించాలి. ఎంత సేవ చెయ్యాల్సి ఉందో చెప్పటం, అందులో తాము పాత్ర వహించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చెయ్యటం మాత్రమే చాలదు. రక్షకుని సేవను ఎలా చెయ్యాలో వారికి నేర్పించటం అవసరం. క్రీస్తుకి ఆత్మల్ని సంపాదించటానికి ఉత్తమ పద్దతుల్లో వారికి శిక్షణ, క్రమశిక్షణ, అభ్యాసం ఇవ్వాలి. సాటి యువ స్నేహితులకి నెమ్మదిగా ఆర్భాటం లేకుండా సహాయం చెయ్యటం వారికి నేర్పించండి. వారు భాగం పంచుకోగల ఆయా మిషనెరీ సేవా శాఖల్ని నిర్దేశించి వాటిలో వారికి ఉపదేశాన్ని సహాయాన్ని అందించండి. గాస్పుల్ వర్కర్స్, పు. 210. ChSTel 29.1