Go to full page →

విజయ రహస్యం ChSTel 32

యువకులారా, ప్రభువును తెలుసుకునేందుకు ఆయన్ని వెంబడించుడి, అప్పుడు “ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును” అని మీరు గ్రహిస్తారు. అభివృద్ధి సాధనకు నిత్యం కృషి చెయ్యండి. విమోచకుడైన క్రీస్తులా ఉండటానికి పట్టుదలతో కృషిచెయ్యండి. క్రీస్తు పై విశ్వాసంతో నివసించండి. ఆయన ఏ పని చేశాడో ఆ పని కొనసాగించండి. ఆయన ఏ ఆత్మల్ని రక్షించటానికి తన ప్రాణం అర్పించాడో వారిని రక్షించటానికి నివసించడండి. మీకు ఎవరితో పరిచయం ఏర్పడుందో వారికి సహాయం చెయ్యటానికి అన్ని విధాలా ప్రయత్నించండి... మీ పెద్దన్నతో మాట్లాడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చిట కొంత అచ్చట ఉపదేశిస్తూ ఆయన మీ శిక్షణను పూర్తి చేస్తాడు. నశిస్తున్న లోకాన్ని రక్షించటానికి తన్నుతాను త్యాగం చేసుకున్న రక్షకునితో సన్నిహిత సంబంధం మిమ్మల్ని యోగ్యమైన పనివారిగా రూపుదిద్దుతుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 416. ChSTel 32.4

సేవకోసం వ్యవస్థీకరించుకోండి. యువకుల్లారా, యువతుల్లారా, ఆత్మలు నాశనమయ్యిపోకుండా కాపాడేందుకు మిమ్మల్ని మీరు చిన్న గుంపులుగా వ్యవస్థీకరించుకుని క్రీస్తు యోధులుగా ఆయన సేవకు అంకితం చేసుకుని మీ నేర్పును, నైపుణ్యాన్ని ప్రతిభను ఆయన సేవకు వినియోగించలేరా?... నిజంగా యేసుని ప్రేమించే యువకులు యుతులు సబ్బాతును ఆచరిస్తున్నట్లు చెప్పుకునే వారి కోసమేగాక మన విశ్వాసానికి చెందని వారి కోసం కూడా సేవ చెయ్యటానికి తమను తాము వ్యవస్థీకరిచుకుంటారా? సైన్స్ ఆఫ్ ది టైమ్స్, మే 29, 1893. ChSTel 33.1

యువకులు యువతులు పిల్లలు క్రీస్తు నామంలో పనిచెయ్యటం మొదలు పెట్టాలి. వారు కలిసి ఓ ప్రణాళికను రచించుకుని కార్యాచరణ విధానాన్ని నిర్ణయించుకోవాలి. మీరు పనివారిగా ఏర్పడి, కలిసి ప్రార్ధన చేయ్యటానికి సమయాలు నిర్దేశించుకుని, తన కృపను అనుగ్రహించాల్సిందిగా ప్రభువుని యాచిస్తూ సంఘటిత కార్యాచరణ చేపట్టలేరా? యూల్స్ ఇన్స్టక్టర్, ఆగ. 9, 1894. ChSTel 33.2