దైవ ప్రజలు హెచ్చరికను పాటించి చివరి దినాల సూచనల్ని గ్రహించాలి. క్రీస్తు రాకకు సూచనలు అతి స్పష్టమైనవి. సందేహానికి తావులేనివి. ఈ విషయాల దృష్ట్యా సత్యాన్ని విశ్వసించే ప్రతీవారు సజీవ బోధకులవ్వాలి. బోధకులు ప్రజలందర్నీ మేల్కొల్పవలసిందిగా దేవుడు పిలుస్తున్నాడు. పరలోకమంతా జాగృతమయ్యింది. లోక చరిత్ర దృశ్యాలు త్వరితంగా సమాప్తమౌతున్నాయి. మనం చివరి దినాల సంకట పరిస్థితుల నడుమ నివసిస్తున్నాం. అయినా మనం మెలకువగా లేం. ఈ నిష్క్రియాపరత్వం, దేవుని సేవపట్ల చిత్తశుద్ధి కొరవడటం మిక్కిలి భయంకరం. మరణ సదృశమైన ఈ మత్తు సాతాను కలిగించింది. టెస్టిమొనీస్, సం.1, పులు. 260, 261. ChSTel 37.1
దేవుడు తమకిచ్చిన తలాంతుల్ని ప్రశస్త సత్యం ఎరుగని వారికి వెలుగు అందించటం ద్వారా వృద్దిపర్చటం లేదుగనుక, శవాన్ని కప్పే గుడ్డలా అవిశ్వాసం మన సంఘాల్ని కప్పుతున్నది. జెనరల్ కాన్ఫరెన్స్ బులిటన్, 1893, పు. 133. ChSTel 37.2
చివరగా తాసులో తూచగా వారు తక్కువగా ఉన్నట్లు కనబడేందుకు, సత్యాన్ని ప్రకటించటంలో నిర్వహించాల్సిన పాత్రను నిర్వహించకుండా వారిని ఆపటానికి సాతాను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.1, పు. 260. ChSTel 37.3
మనుషులు ప్రమాదంలో ఉన్నారు. కాని క్రీస్తు అనుచరులమని చెప్పుకునేవారిలో ఏ కొద్దిమందికోగాని ఈ ఆత్మల విషయంలో హృదయ భారంలేదు. ఓ లోకం భావిగతి తాసులో వేలాడుతున్నది. అయినా మానవుల కివ్వబడ్డ మిక్కిలి దీర్ఘకాలిక సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పుకునే వారిని సయితం ఈ పరిస్థితి కదిలింటం లేదు. మానవత్వం మానవత్వాన్ని స్పృశించి మానవత్వాన్ని దేవత్వానికి ఆకర్షించేందుకు తన పరలోక గృహాన్ని విడిచిచె పెట్టి, మానవ స్వభావాన్ని స్వీకరించటానికి క్రీస్తుని నడిపించిన ప్రేమ కొరవడుతున్నది. దైవప్రజలు జడత్వం, పక్షవాతం గుప్పెట్లో కునారిల్లుతున్నారు. ఇందువల్ల వారు ప్రస్తుత గడియలో తమ విధిని అవగాహన చేసుకోలేకపోతున్నారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 303. ChSTel 37.4
తన శక్తుల్ని బలపర్చుకుని, ఆత్మల్ని తన పక్కకు తిప్పుకోటానికి సాతాను నామమాత్రపు క్రైస్తవుల సోమరితనాన్ని ఉపయోగించుకుంటాడు. క్రీస్తుకి వాస్తవికమైన సేవ చెయ్యకపోయినా ఆయన పక్క ఉన్నామని భావించే అనేకులు ఆ స్థలాన్ని శత్రువు ముందే ఆక్రమించి లాభం పొందటానికి సహాయపడ్తున్నారు. విధుల్ని నిర్వర్తించకుండా విడిచి పెట్టడం ద్వారా, పలకవలసిన మాటలు పలక్కపోవటం ద్వారా, దేవునికి నమ్మకమైన సేవకులు కావటంలో వైఫల్యం చెందటం ద్వారా, తాము క్రీస్తుకి సంపాదించాల్సిన ఆత్మల పై సాతాను నియంత్రణ సంపాదించటానికి వారు దోహదపడతారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 280. ChSTel 38.1
నేను లేఖనాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ చివరి దినాల్లో దేవుని ఇశ్రాయేలు నిమిత్తం ఆందోళన చెందుతాను. విగ్రహారాధన నుంచి పారిపోవలసిందిగా వారికి హెచ్చరిక వస్తున్నది. వారు నిద్రమత్తులో ఉన్నారని, దేవుని సేవించే వ్యక్తి ఎవరో సేవించని వ్యక్తి ఎవరో గుర్తించలేనంతగా వారు లోకంతో మమేకమయ్యారని భయపడుతున్నాను. క్రీస్తుకి ఆయన ప్రజలకి మధ్య దూరం పెరుగుతున్నది. వారికీ లోకానికీ మధ్య దూరం తగ్గుతున్నది. క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకునేవారికి లోకానికి మధ్యగల విలక్షణత గుర్తులు దాదాపు మాయమౌతున్నాయి. పూర్వం ఇశ్రాయేలులా తమ చుట్టూ ఉన్న జాతుల హేయకృత్యాల్ని అనుసరిస్తున్నారు. టెస్టిమొనీస్, సం.1, పు. 277. ChSTel 38.2