దేవుని సేవచెయ్యటానికి అవకాశాల కోసం తమ చుట్టూ చూడటానికి సంఘాల కళ్లకు పరలోక సంబంధమైన కాటుక అవసరం. తన ఇల్లు నిండేటట్లు రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్లి లోపలికి రావటానికి ప్రజల్ని బలవంతం చెయ్యమని దేవుడు తన ప్రజల్ని పదేపదేకోరుతున్నాడు. అయినా మన తలుపు నీడలోనే ఉన్న అనేక కుటుంబాల ఆత్మల పట్ల మనకు ఆసక్తి ఉన్నట్లు సూచించలేకపోతున్నాం. మనకు దగ్గరగా ఉన్న ఈ పనిని సంఘం చేపట్టాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. “నా పొరుగువాడెవడు?” అంటూ మనం నిలబడి ఉండకూడదు. ఎవరికి మన సానుభూతి మన చెయ్యూత అవసరమో అతడు మన పొరుగువాడు. విరోధిచేత దెబ్బలు గాయాలు పొందిన ప్రతీ ఆత్మ మన పొరుగువాడే. దేవుని సొత్తయిన ప్రతీవ్యక్తీ మన పొరుగువాడే. నా పొరుగువాడెవరు? అంటూ యూదులు కనపర్చిన వివక్ష క్రీస్తులో మటుమాయమౌతుంది. సరిహద్దులు, కులం, కులీన స్వామ్యం వంటి కృత్రిమ భేదాలు లేవు. టెస్టిమొనీస్, సం.6, పు. 294. ChSTel 39.3