అదుపు చేసే దైవాత్మ ఇప్పుడు సైతం లోకంలోనుంచి ఉపసంహరించబడుతున్నది. గాలివానలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, వరదలు, సముద్రంలో విపత్తులు, నేల పై విపత్తులు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా సంభవిస్తున్నాయి. వీటిని విశదం చెయ్యటానికి విజ్ఞానశాస్త్రం ప్రయత్నిస్తుంది. దైవకుమారుని రాక సమీపంగా ఉన్నదని తెలుపుతూ మనచుట్టూ చోటు చేసుకుంటున్న గుర్తులికి అసలు కారణం గాక వేరే కారణమిస్తున్నారు. దేవుని సేవకులు ముద్రించబడే వరకూ వీచకుండా నాలు గాలుల్ని నియంత్రిస్తున్న పహరా దూతల్ని మనుషులు చూడలేరు. కాని గాలుల్ని విడిచి పెట్టమంటూ దేవుడు తన దూతల్ని ఆదేశించినప్పుడు, ఏ మానవుడు ఊహించలేని సంఘర్షణలు చోటుచేసుకుంటాయి. టెస్టిమొనీస్ సం.6, పు. 408. ChSTel 55.4
మనం నివసిస్తున్న దినాలు గంభీరమైనవి ప్రాముఖ్యమైనవి. దేవుడు తన ఆత్మను భూమి పై నుంచి క్రమక్రమంగా ఉపసంహరించు కుంటున్నాడు. దేవుని కృపను తృణీకరించే వారిపై తెగుళ్లు, దేవుని తీర్పులు ఇప్పటికే పడుతున్నాయి. నేల పైన, సముద్రం పైన విపత్తులు, సమాజంలో అస్తవ్యస్తపరిస్థితులు, యుద్ధభయం, ఇవన్నీ ప్రమాద సూచికలు. అపూర్వ సంఘటనలు త్వరలో సంభవించనున్నాయని అవి సూచిస్తున్నాయి. దుష్ట పరివారం తమ బలగాల్ని ఏకంచేసి సంఘటిత పర్చుతున్నారు. చివరి సంక్షోభానికి వారు బలం కూర్చుకుంటున్నారు. కొద్దికాలంలో లోకంలో గొప్పమార్పులు చోటుచేసుకోనున్నాయి. చివరి కదలికలు త్వరత్వరగా జరిగిపోతాయి. టెస్టిమొనీస్, సం.9, పు.11. ChSTel 56.1
లోకంలో ఏ మానవ గుగ్గిలం నివారించలేని దుఃఖం సంభవించే సమయం అతి సమీపంలో ఉంది. దేవుని ఆత్మ ఉపసంహరించ బడుతున్నది. సముద్రం పైన నేల పైన విపత్తులు ఒకదాని వెంట ఒకటి వేగంగా సంభవిస్తున్నాయి. భూకంపాలు, గాలితుఫానులు, అగ్ని ప్రమాదాలు, వరదలవల్ల విధ్వంసం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గూర్చి ఎంత తరచుగా మనం వింటాం! ఈ ఉపద్రవాలు ప్రకృతి శక్తులు క్రమం తప్పటంవల్ల హఠాత్తుగా కలిగే చాపల్యాలుగా, మానవ శక్తి అదుపులో లేనివిగా కనిపిస్తాయి. కాని వాటన్నిటిలో దేవుని ఉద్దేశాన్ని చదవవచ్చు. తమ అపాయాన్ని గూర్చి పురుషుల్ని స్త్రీలను మేల్కొల్పటానికి దేవుడు ఏర్పర్చుకున్న సాధనాలల్లో ఇవి కొన్ని. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 277. ChSTel 56.2