లౌకికమైన సమస్తానికి అంతం వేగవంతమౌతున్న ప్రస్తుతకాలంలో లోకాన్ని తన ఉచ్చులో బంధించటానికి సాతాను విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మనసుల్ని ఆకట్టుకుని, రక్షణకు ముఖ్యమైన సత్యాల నుంచి దృష్టిని మళ్లించటానికి అతడు అనేక ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రతి నగరంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవారిని పార్టీలుగా వ్యవస్తీకరించటానికి అతడి ప్రతినిధులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రధాన వంచకుడు గందరగోళ పరిస్థితుల్ని, తిరుగుబాటును ప్రవేశ పెట్టటానికి శాయశక్తుల కృషిచేస్తున్నాడు. మనుషుల్ని ఉత్సాహంతో నింపుతున్నాడు. అది జ్ఞానం వలన కలిగే ఉత్సాహం కాదు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 219. ChSTel 58.3
సాతాను శ్రద్దగల బైబిలు విద్యార్థి. తనకు తక్కువ సమయముందని అతడెరుగును. భూమి పై ప్రతీ విషయంలోను ప్రభువు పనిని వ్యతిరేకించటానికి అతడు ప్రయత్నిస్తాడు. టెస్టిమొనీస్, సం.9, పు.10. ChSTel 58.4
చివరగా తమను తాసులో తూచగా వారు తక్కువగా ఉన్నట్లు కనపడేందుకు దైవప్రజల్ని నిష్క్రియాపరులుగా ఉంచి తద్వారా సత్యాన్ని ప్రకటించటంలో తమ పాత్రను పోషించకుండా వారిని పక్కదారి పట్టించటానికి సాతాను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం.1, పు.260. ChSTel 59.1