దేవునికి గొప్ప సేవ చేసే గౌరవనీయులైన పనివారు ఎందరు జీవితంలోని బహుచిన్న పదవుల్లో అతిసామాన్య విధుల మధ్య శిక్షణను పొందుతారు! మోషే ఐగుప్తు దేవానికి కానున్న రాజు. కాని మోషేకి తాను నియమించిన పనికి దేవుడు అతణ్ని రాజు ఆస్థానం నుంచి తీసుకోలేకపోయాడు. అతడు నలభై సంవత్సరాలు నమ్మకమైన గొర్రెల కాపరిగా ఉన్న తర్వాతే తన ప్రజల్ని విమోచించటానికి దేవుడు అతణ్ని పంపాడు. ఇశ్రాయేలు సైన్యాల్ని విమోచించటానికి తన సాధనంగా ఉండటానికి దేవుడు గిద్యోనును గోధుమ కళ్లంలోనుంచి పిలిచాడు. దేవుని పిలుపు మేరకు ఎలీషా నాగలి విడిచి పెట్టి వెళ్లాడు. ప్రకటించేందుకు దేవుడు తనకు ఓ వర్తమానం ఇచ్చినప్పుడు ఆమోసు నేల దున్నే వ్యవసాయదారుడు. క్రీస్తు జతపనివారుగా పనిచేసేవాందరూ కఠినమైన, అననుకూలమైన సేవ చేయాల్సి ఉంటుంది. తాము బోధించాల్సిన పాఠాల్సివారు తెలివిగా ఎంపికచేసుకుని, తమ గుణలక్షణాలకు, తాము చేయాల్సిఉన్న సేవకు వాటిని అనుకూలంగా మలుచుకోవాలి. గాస్పుల్ వర్కర్స్, పులు. 332, 333. ChSTel 65.3