ఇతరులికి అందించాలన్న ధ్యేయంతో మనం సాధ్యమైనంత విద్యను సంపాదించాలని ప్రభువు కోరుతున్నాడు. ఎక్కడ ఎలా పని చెయ్యటానికి పిలుపు వస్తుందో లేక దేవున్ని గూర్చి ఎక్కడ మాట్లాడే అవకాశం కలుగుతుందో ఎవరికీ తెలియదు. వారిని ఎలా వినియోగించుకోవాలో మన పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు. మన దుర్బల విశ్వాసంతో మనం చూడలేని అవకాశాలు మన ముందున్నాయి. అవసరమైతే దైవ వాక్యంలోని సత్యాల్ని లోకంలోని అత్యున్నత అధికారాల ముందు సమర్పించటానికి తగినట్లు మన మనసుల్ని తరీతు చేసుకోవాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 333, 334. ChSTel 68.2
ఎవరు ఆయన ద్రాక్ష తోటలోకి వెళ్లి పని చెయ్యటానికి సిద్ధపడ్తున్నారు? అనుభవం లేనివారితో దేవుడు తృప్తి చెందడు. మనకిచ్చిన వరాల్ని అత్యుత్తమ రీతిగా వినియోగించుకోవాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఏప్రి. 2, 1889. ChSTel 68.3