ఇప్పుడు ఒక్క వ్యక్తి పనిచేస్తున్న చోట పని చేసేందుకు వందలు లేకపోటం ఓ మర్మంగా ఉంది. దేవుని కుమారులం కుమార్తెలం అని చెప్పుకునే వారి ఉదాసీనత, నిరాసక్తత, అశక్తత పరలోక విశ్వానికి విస్మయం కలిగిస్తున్నాయి. సత్యంలో సజీవ శక్తి ఉంది. టెస్టిమొనీస్, సం.9, పు. 42. ChSTel 100.2
సోమరితనంతో, నిష్కియావరత్వంతో మనం ఎన్నడూ రక్షించబడలేం. నిజమైన మారుమనసు పొందిన వ్యక్తికి నిస్సహాయమైన, నిరుపయోగమైన జీవితం అన్నది లేదు. పరలోకంలోకి అలా అలా కొట్టుకు పోటం సాధ్యం కాదు. సోమరి పరలోకంలో అడుగు పెట్టలేడు. లోకంలో దేవునితో సహకరించని వారు పరలోకంలోనూ ఆయనతో సహకరించరు. వారిని పరలోకానికి తీసుకువెళ్లటం క్షేమం కాదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 280. ChSTel 100.3
చీకటిలో ఉన్నవారికి వెలుగు అందించటానికి సంఘసభ్యులు వ్యక్తిగతంగా ఏమి చేస్తున్నారో తెలుసుకోటానికి పరలోకమంతా ఆశగా చూస్తున్నది. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర. 27, 1894. ChSTel 101.1
మీరు దేవునితో వ్యవహరిస్తున్నారని, మీరు ఆటలాడటానికి ఆయన చిన్నపిల్లవాడు కాడని గుర్తుంచుకోవాలి. మనసు పుట్టినప్పుడు చేసి, ఇష్టం లేనప్పుడు ఆయన సేవను విడిచి పెట్టలేరు. టెస్టిమొనీస్, సం.2, పు. 221. ChSTel 101.2
పరలోక నివాసులు మానవ ప్రతినిధులతో సహకరించటానికి ఎదురు చూస్తున్నారు. వారి సముఖాన్ని మనం గుర్తించలేం. టెస్టిమొనీస్, సం.6, పు. 297. ChSTel 101.3
జరగాల్సి ఉన్న గొప్ప సేవలో మానవ ప్రతినిధులతో అనగా సంఘ సభ్యులతో సహకరించటానికి పరలోక దూతలు కని పెడ్తున్నారు. వారు నీ కోసం కని పెడ్తున్నారు. టెస్టిమొనీస్, సం.9, పులు. 46, 47. ChSTel 101.4
అనేకులు ఏమి చెయ్యకుండా, బాధ్యతల్ని తిరస్కరిస్తూ, దేవుని దినాన్ని సమీపిస్తున్నారు. ఫలితంగా వారు మతపరమైన మరుగుజ్జులు. దేవుని సేవకు సంబంధించినంతవరకు, వారి జీవిత చరిత్ర పుటలు ఖాళీగా ఉంటుంటాయి. వారు దేవుని తోటలోని వృక్షాలు. కాని వారు నేలకు భారంగా ఉంటారు. ఫలాలు లేని తమ కొమ్మల్ని విస్తరించి భూమిని చీకటితో కప్పి ఫలాలు ఫలించే చెట్లకు తావు లేకుండా చేస్తారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మే 22, 1888. ChSTel 101.5
క్రీస్తుకి ఎలాంటి సేవ చెయ్యనివారు ప్రమాదంలో ఉన్నారు. గొప్ప ఆధిక్యతలు, తరుణాలు ఉన్నా, ఏమి చెయ్యకుండా మౌనంగా ఉండిపోయే వ్యక్తి ఆత్మలో దైవ కృప ఎక్కువ కాలం నివసించదు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ, 22, 1899. ChSTel 101.6
నిద్రపోటానికి సమయం లేదు. వ్యర్థ సంతాప ప్రకటనలకు సమయం లేదు. ఇప్పుడు మత్తు నిద్రలో మునగటానికి సాహసించే వ్యక్తి మేలు చెయ్యటానికి మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటాడు. ఆ గొప్ప పంట సమయంలో పనలు పోగుచేసే మహాభాగ్యం మనకు లభిస్తుంది. రక్షించబడ్డ ప్రతీ ఆత్మ మన పూజనీయ విమోచకుడైన యేసు కిరీటంలో ఒక అదనపు నక్షత్రమౌతుంది. యుద్ధం ఇంకా కొంత సేపు కొనసాగిస్తే నూతన విజయాలు, నిత్యత్వానికి నూతన ట్రోఫీలు సాధించనునప్పుడు యుద్ద కవచాన్ని తీసి పక్కన పెట్టటానికి ఎవరు ఆత్రంగా ఉంటారు? రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 25, 1881. ChSTel 101.7
పరలోక దూతలు తమ పనిని తాము చేస్తున్నారు. అయితే మనమేం చేస్తున్నాం? సోదర సోదరీల్లారా, మీ సమయాన్ని సద్వినియోగం చెయ్యాల్సిందిగా దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. దేవుని సన్నిహితులవ్వండి. మీలో ఉన్న వరాన్ని వృద్ధి పర్చుకోండి. మన విశ్వాసానికి కారణాలతో పరిచయం కలిగి ఉన్నవారు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు కార్యసాధనకు ఉపయోగించాలి. హిస్తారికల్ స్కెచ్చేస్, పు. 288. ChSTel 102.1
“నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక” అంటూ ప్రభువు ప్రార్ధన వల్లించే మీరు ఇతరులికి సత్యాన్ని అందించటానికి సహాయం చెయ్యకుండా ఎలా మా గృహాల్లో సుఖంగా కూర్చోగలరు? ఇతరులికి సహాయం చెయ్యటానికి మీరు దాదాపు ఏమి చెయ్యనప్పుడు, దేవుని ముందు చేతులు జోడించి మిమ్మిల్ని మీ కుటుంబాల్ని దీవిచమంటూ దేవునికి ఎలా ప్రార్థన చెయ్యగలరు? హిస్టారికల్ స్కెచస్. పు. 288. ChSTel 102.2
తాము సమయం తీసుకుని పరిగణించినట్లయితే, తమ క్రియా శూన్య పరిస్థితిని, దేవుడు తమకిచ్చిన తలాంతల్ని నిర్లక్ష్యం చేసి చేసిన పాపాన్ని పరిగణించేవారు మనమధ్య ఉన్నారు. సోదర సోదరీలారా, మీ హృదయ కాఠిన్యానికి మీ రక్షకుడు, మొత్తం పరలోక దూతలు వేదన చెందుతున్నారు. ఆత్మల్ని రక్షించటానికి క్రీస్తు తన సొంత ప్రాణాన్నిచ్చాడు. అయితే ఆయన ప్రేమను ఎరిగిన మీరు ఆయన తన కృపాదీవెనల్ని ఎవరికివ్వటం కోసం మరణించాడో వారికందించటానికి కృషి చెయ్యటం లేదు. అలాంటి ఉదాసీనత, విధి నర్వహణ నిర్లక్ష్యం దేవదూతలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మీరు అలక్ష్యం చేసిన ఆత్మల్ని మీరు తీర్పులో కలుసుకోవాలి. ఆ రోజున మీరు స్వయం నిందింతులు స్వయం దండితులు అవుతారు. ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని పశ్చాత్తాపానికి నడిపించునుగాక. తన ద్రాక్షతోటలో తన ప్రజలు చెయ్యటానికి ఆయన ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేసినందుకు ప్రభువు వారిని క్షమించునుగాక. టెస్టిమొనీస్, సం.6, పులు. 42, 426. ChSTel 102.3
తన త లాంతును భూమిలోనుంచి తవ్వితీసి దాన్ని వినియమదారులికి ఇవ్వాల్సిన అవసరాన్ని సోమరి సంఖుస్థుడు గుర్తించేందుకు అతడికి మనం ఏమి చెప్పగలం? పరలోక రాజ్యంలో పనిలేని వారు సోమరులు ఉండరు. ఈ విషయం ప్రాముఖ్యాన్ని నిద్రపోతున్న సంఘాల ముందు దేవుడు ఉంచునుగాక! సీయోను లేచి తన రమ్యవస్రాల్ని ధరించునుగాక! సీయోను వెలిగిపోవునుగాక! టెస్టిమొనీస్, సం.6, పు. 434. ChSTel 103.1
సత్యం తెలియని వారి నిమిత్తం చెయ్యాల్సిన పని ఉంది. మీరు చీకటిలో ఉన్నప్పుడు మా విషయంలో చేసిన పనివంటిది అది. నిద్రపోటానికి సమయంలేదు. సోమలు, నిష్కియులు అవ్వటానికి లేదు. గృహయజమానుడు ప్రతీవారికీ ఓ పని నియమిస్తాడు. మనం ముందుకి వెళ్లాలిగాని వెనక్కికాదు. మనుషులు మారుమనసు పొందటం దినదినం జరగాలన్నది మా ఆకాంక్ష. మనం అనేకుల ఆత్మల్ని రక్షించటంలో సాధనాలయ్యేందుకు యేసు ప్రేమ మన హృదయాల్లో స్పందించాలన్నది మా ఆకాంక్ష. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 103.2
దేవుని కుమారుణ్ని లేక కుమార్తెను అని చెప్పుకునే ప్రతీ వ్యక్తి సకల దుర్నీతి నుంచి తొలగటమేకాదు, విస్తారమైన ప్రేమ, ఆత్మత్యాగం, వినయంతో నిండిన కార్యాలు కూడా చెయ్యాలని యేసుప్రభువు కోరుతున్నాడు. మనకు మన పనిని గూర్చి గుర్తుచేస్తూ పనిచేసే ఓ మానసిక చర్యసంబంధిత చట్టాన్ని ప్రభువు సమర్పిస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, “లేనివాని యొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడును.” తమ అవకాశాల్ని సద్వినియోగం చెయ్యనివారు, దేవుడు తమకిచ్చే కృపను పంచని వారు ఆ పనులు చెయ్యటానికి అంత సుఖంగా ఉండరు. తుదకు వారు మత్తునిద్రవంటి జడత్వంలోపడి ఒకప్పుడు తమకున్నదాన్ని పోగొట్టుకుంటారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప అనుభవం సంపాదించటానికి, తమ పైకి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు తట్టుకోగలిగేందుకు విషయాల్లో ఎక్కువ జ్ఞానం సంపాదించటానికి వారు ఏర్పాట్లు చేయరు. హింసగాని, శోధనగాని వచ్చినప్పుడు ఈ తరగతి ప్రజలు తమ ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోతారు. తమ పునాదిని స్థిరపరుచకునే అవసరాన్ని వారు గుర్తించలేదు గనుక అది కొట్టుకుపోతుంది. తమ ఆత్మల్ని వారు యుగాల బండకు చీలలతో బిగించి పటిష్ఠం చేసుకోలేదు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 27, 1894. ChSTel 103.3
మనం ఎవరితో సహవాసం సాన్నిహిత్యం కలిగి ఉంటూ వచ్చామో వారు మనతో నిరంతరం వేరయ్యే ఆ చివరి మహాదినం ఎంత భయంకరమైంది! మన కుటుంబ సభ్యులు, బహుశా మన సొంత బిడ్డలు రక్షణ పొందకుండా మిగిలిపోవంటం, మన కుటుంబాల్ని సందర్శించి మనతో కలిసి భోజనం చేసేవారు నశించిన వారిలో ఉండటం ఎంత భయంకరం! అప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవాలి. క్రీస్తు మతం వారికి నచ్చకపోటానికి కారణం నా అసహనమా? క్రీస్తు స్వభావం వంటిది కాని నా స్వభావమా? స్వార్థం అదుపులో లేకపోటమా? ChSTel 104.1
త్వరలో చోటుచేసుకోనున్న క్రీస్తు రాకనుగూర్చి లోకాన్ని హెచ్చరించాలి. మనం ఈ పనిచెయ్యటానికి ఎక్కువ సమయంలేదు. మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకటానికి ఇతరులికి వెలుగును వెదజల్లటానికి మనం ఉపయోగించగలిగి ఉండే అనేక సంవత్సరాలు గతించి, నిత్యత్వంలోకలిసిపోయాయి. దైవ సేవకులు తమకు వాక్య పరిచర్య చేసినందున గొప్ప వెలుగు కలగి, సత్యంలో స్థిరంగా ఉన్న తన ప్రజలు ఇప్పుడు తమకోసం ఇతరులకోసం మును పెన్నటికన్నా బలంగా పనిచయ్యాల్సిందిగా దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రతీ సామర్థ్యాన్ని వినియోగించండి. ప్రతీ శక్తిని దేవుడు అప్పగించిన వెలుగునంతటిని ఇతరులుకి మేలు చెయ్యటానికి వినియోగించండి. ప్రసంగికులవ్వటానికి కాక దేవుని పరిచారకులవ్వటానికి ప్రయత్నించండి. సదర్న్ వాచ్ మేన్, జూన్ 20,1905. ChSTel 104.2