Go to full page →

బరువైన కిరీటం లక్ష్యంగా పెట్టుకోండి ChSTel 124

మనం అలసిపోకూడదు లేక బలహీనపడకూడదు. సుఖాలు, వసతులు, ఆనందం లేక శరీరాశల కోసం నిరంతర మహిమను వదులుకోటం గొప్ప నష్టం. జయించేవాడికి దేవుడిచ్చే బహుమతి సిద్దంగా ఉంది. దానికి మనలో ఒక్కడుకూడా అర్హుడుకాడు. అది ఆయన ఉ చితంగా ఇచ్చే వరం. ఇది అద్భుతమైన, మహిమాన్వితమైన వరం. అయితే “మహిమను బట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదు” అని మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం విజయం కోసం పోరాడుతున్నప్పుడు యేసు శక్తితో నక్షత్రాలతో బరువైన కిరీటం కోసం పోరాడదాం. “నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.” రివ్యూ అండ్ హెరాల్డ్, అక్టో. 25, 1881. ChSTel 124.3